Dwaraka Tirumala Chinna Venkanna VaisakhaMasa Brahmotsavams: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వైశాఖ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే7 తారీకు వరకు చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీభూసమేత మహా విష్ణువు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు హారతులుపట్టి, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా ముస్తాబు చేశారు అర్చకులు.
ఈ కార్యక్రమం ఆలయ నిత్యకల్యాణమండపంలో స్వామివార్లను పత్యేక మండపంపై అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో త్రినాధరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు గజవాహనంపై స్వామివార్లను ఊరేగించారు. ఈ నెల 4 న తేదీన స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. 5 న స్వామి వారి రథోత్సవం, 6న శ్రీచక్రవార్యుత్సవం, ధ్వజావ రోహణ, 7న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, అదే రోజు రాత్రి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఆలయ ఈఓ. భక్తుల రద్దీ దృష్యా ప్రత్యేక ఏర్పాట్లు, భద్రత కల్పించారు అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..