Dream Science: పితృపక్షంలో కలల ద్వారా సందేశం పంపే పూర్వీకులు.. ఏ కలకు ఏ అర్ధం అంటే

పూర్వీకుల ఆత్మల శాంతి, సంతృప్తి కోసం పితృ పక్ష సమయం అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే తర్పణ, శ్రాద్ధ కర్మలు, దానాలు పూర్వీకుల ఆశీర్వాదం కోసం చేస్తారు. అయితే స్వప్న శాస్త్రం పితృ పక్షంతో వచ్చే కలలకు ఉన్న సంబంధాన్ని కూడా వివరిస్తుందని మీకు తెలుసా? ఈ పక్షం రోజుల్లో కనిపించే కొన్ని ప్రత్యేక కలలు పూర్వీకుల నుంచి సందేశాలను తెస్తాయని నమ్ముతారు. మీరు వాటిని అర్థం చేసుకుంటే.. మీకు మీ పూర్వీకుల మనసు తెలుస్తుంది.

Dream Science: పితృపక్షంలో కలల ద్వారా సందేశం పంపే పూర్వీకులు.. ఏ కలకు ఏ అర్ధం అంటే
Dreams In Pitru Paksha

Updated on: Sep 18, 2025 | 10:14 AM

పురాతన భారతీయ శాస్త్రాల్లో ఒకటి స్వప్న శాస్త్రం. దీని ప్రకారం పితృ పక్షం అనేది ఆచారాలు, నైవేద్యాలకు మాత్రమే కాదు పూర్వీకులు కలల ద్వారా వారి వారసులతో సంభాషించడానికి ప్రయత్నించే ఆధ్యాత్మిక కాలం కూడా. ఈ కలలు పూర్వీకుల దీవెనలు, హెచ్చరికలు లేదా దాచిన సందేశాల శక్తివంతమైన సూచికలుగా పరిగణించబడతాయి. ఈ సంకేతాలను గుర్తించడం వల్ల శ్రేయస్సు, శాంతి, దైవిక మార్గదర్శకత్వం లభిస్తుంది.

పూర్వీకుల సందర్శనం
పితృ పక్ష సమయంలో మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీ పూర్వీకులు మీ పట్ల సంతోషంగా ఉన్నారని, ఆనందం, శ్రేయస్సుకు మార్గం త్వరలో తెరుచుకుంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

నీరు లేదా నది కలలో కనిపిస్తే
కలలో నది, చెరువు లేదా స్వచ్ఛమైన నీటిని చూడటం పూర్వీకుల సంతృప్తిని సూచిస్తుంది. మీ పూర్వీకులు నైవేద్యాలు లేదా శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందారని, ఇంట్లో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయని ఈ కల తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆహారం, వంటలు
పితృ పక్షంలో ఆహారం, వంటకాలు లేదా ధాన్యాలు కలలు కన్నట్లయితే.. ఆ కలకు అర్ధం పూర్వీకులు దానాలను కోరుకుంటున్నారని సూచిస్తుంది. ఈ సమయంలో బ్రాహ్మణులకు లేదా పేదలకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారు. ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు పెరుగుతాయి.

దీపం లేదా నిప్పు కలలలో కనిపిస్తే
కలలో మండుతున్న దీపం, నిప్పు లేదా వెలుతురును చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మలు వెలుగు వైపు కదులుతున్నాయని, మీ ప్రార్థనలకు తగిన ఫలితం దక్కిందని ఈ కలకు అర్థం.

జంతువులు, పక్షుల సంకేతాలు
స్వప్న శాస్త్రం ప్రకారం పితృ పక్షంలో కాకి, ఆవు లేదా తెల్ల పావురాన్ని కలలో కనిపించినట్లయితే.. పూర్వీకులు మిమ్మల్ని సంప్రదిస్తున్నారని స్పష్టమైన సందేశం. ముఖ్యంగా కాకులు పూర్వీకుల దూతలుగా పరిగణించబడతాయి.

మీకు అలాంటి కలలు వస్తే ఏమి చేయాలి?
పితృ పక్ష సమయంలో మీకు ఈ కలలు వస్తే.. ఉదయం నిద్రలేచి మీ పూర్వీకుల పేరితో నీటిని సమర్పించి “ఓం పితృదేవాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. బ్రాహ్మణులకు, ఆవులకు లేదా పేదలకు దానం చేయడం కూడా శుభప్రదం. పితృ పక్షం ఈ సంకేతాలను ఎప్పుడూ విస్మరించకూడదని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇవి కేవలం కలలు కావు.. మీ విధిని మార్చుకోవడానికి మీ పూర్వీకుల నుంచి వచ్చిన పిలుపు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు