హిందూ మతంలోని అనేక గ్రంథాలలో ఒక స్వప్న శాస్త్రం కూడా ఒకటి. ఈ స్వప్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారు తమకు వచ్చే ప్రతి కలకు సంబందించిన అర్థాన్ని అర్థం చేసుకోగలడు. వాటి గురించి ఇతరులకు వివరించగలడు. వాస్తవానికి స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి మంచి చెడుల అర్థం ఉంటుందని పేర్కొంది. సరళంగా చెప్పాలంటే కొన్ని కలలు రాబోయే భవిష్యత్తు గురించి ఒక వ్యక్తికి కొన్ని సూచనలను ఇస్తాయి. ఈ సంకేతాలు మంచి, చెడు రెండూ కావచ్చు.
కలలో చాలా విషయాలు వస్తువులు, జంతువులు, పక్షులు చూసి ఉంటారు. వర్షం కురవడం, గోళ్లు కత్తిరించడం, చంద్రుడు, నదులు, సముద్రాలు, పాములు, పులులు వంటి అనేక విషయాలు కలలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిద్రపోతున్న సమయంలో కలలో పాములు కనిపిస్తాయి. అవి కూడా భిన్నంగా ఉంటాయి. పాము మిమ్మల్ని వెంబడింనట్లు, కాటు వేసి నట్లు ఇలా రకరకాలుగా కలలు చూసి ఉండవచ్చు. ఈ రోజు కలలో పాములు అది నల్ల పాము లేదా తెల్ల పాము కనిపించినట్లయితే.. ఆ కలకి అర్థం.. అటువంటి కల మంచిదా? చెడ్డదా? ఈ రోజు తెలుసుకుందాం..
కలలో నలుపు, తెలుపు రంగుల పాములను చూసి ఉంటారు. ఈ రెండు పాములను కలలో చూసినట్లయితే అవి వేర్వేరు సంకేతాలను ఇస్తాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ కలల సంకేతం ఏమిటంటే.. కలలో నల్లటి పామును చూడటం శుభప్రదం. కలలో నల్లపాము మిమ్మల్ని వెంబడించడం లేదా కలలో నల్ల పాము ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు చూసినట్లయితే.. అటువంటి కల చాలా శుభప్రదంగా పరిగణింపబడుతున్నది.
కలలో నల్ల పాము కనిపించినట్లయితే.. భవిష్యత్తులో మీ ఇంట్లో శుభకార్యాలు జరగానున్నాయని అర్థం. సంపదలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. అందుకే కలలో నల్లపాము కనిపించడం చాలా శుభప్రదమని చెబుతారు.
కలలో తెల్లటి పాము కనిపించడం అశుభం. కలలో తెల్లటి పాము మిమ్మల్ని వెంబడించడం లేదా ఇంట్లోకి తెల్ల పాము ప్రవేశించినట్లు కలలో కనిపిస్తే అది మీకు అశుభం.
మొత్తంమీద నల్ల పాము కలలో చూడటం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది, అయితే తెల్ల పామును చూడటం ఖచ్చితంగా జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు అదే సమయంలో కలలో చాలా పాములు ఒక్కసారిగా కనిపిస్తే ఇది కూడా అశుభంగా స్వప్న శాస్త్రం పేర్కొంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.