Hair Cut: మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదా.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!
హెయిర్ కటింగ్ విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మంగళ, శుక్ర వారాల్లో క్షవరం చేయించుకోకూడదని చెబుతూ ఉంటారు. మరి ఏ రోజు చేయించుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..
హిందూ సంప్రదాయంలో బోలెడన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని రోజులు.. కొన్ని రకాల పనులు చేయకూడదని అంటూ ఉంటారు. మంగళ, శుక్రవారంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించకూడదని ఇంట్లో పెద్దలు అంటూ ఉండటం వింటూనే ఉంటారు. కానీ పని చేసేవాళ్లకు అలా ఉండదు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మంగళ, శుక్ర వారాల్లో చేయించుకోవద్దని ఇంట్లో వాళ్లు వారిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం.. శాస్త్రాలు నమ్మిన వారు.. హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
హెయిర్ కట్ ఎప్పుడు చేసుకుంటే మంచిది:
1. హెయిర్ కట్ ఉదయం చేయించుకుంటే.. 12 గంటల్లోపు చేయించుకోవాలి. రాత్రి సమయంలో హెయిర్ కట్‌కి అసలు వెళ్లకపోవడమే మంచిది.
2. ఇంట్లో వాళ్లు ఎప్పుడైనా సరే ఒకటేసారి హెయిర్ కటింగ్ చేసుకోవడానికి వెళ్లకూడదు.
3. శాస్త్రం ప్రకారం.. ఆది వారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు. ఇలా ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఒక మాసం ఆయువు తగ్గిపోతుందట.
4. సోమవారం హెయిర్ కటింగ్ చేసుకుంటే ఏడు మాసాల ఆయువు వృద్ధి చెందుతుందట. సౌఖ్యం కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
5. మంగళ వారం క్షవరం చేయించుకోవడం వల్ల ఏడు మసాలా ఆయువు తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దు:ఖం కూడా కలుగుతుందట.
6. హెయిర్ కట్ బుధవారం చేయించుకోవడం వల్ల ఐదు మాసాలా ఆయువు వృద్ధి చెందుతుందట. పుష్టిని కూడా కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
7. అదే విధంగా గురువారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే 10 మసాలా ఆయువు వృద్ధి చెందుతుందట. ఆర్థికంగా ఎదగాలి అనుకునేవారు గురువారం హెయిర్ కటింగ్ చేయించుకోవడం మంచిది.
8. శుక్రవారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు. శుక్రవాం హెయిర్ కటింగ్ చేయించుకుంటే.. 11 మసాలా ఆయువు వృద్ధి కలుగుతుందట.
9. అలాగే శనివారం రోజు క్షవరం చేయించుకుంటే.. ఏడు మసాల ఆయువు తగ్గుతుందని.. రోగాలు కూడా వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది శాస్త్రాలు నమ్మిని వారికి వివరించడం జరుగుతుంది.