Dream: కలలో కాకి కనిపించిందా.? దేనికి సంకేతమో తెలుసా.?
కలలో వచ్చే అంశాలు మన జీవితంలో జరిగే అనేక సంఘటనలను సూచిస్తాయి. కలలో ఏం కనిపిస్తే ఏం జరుగుతుందో లాంటి వివరాలను కలల శాస్త్రంలో వివరించారు. మనలో చాలా మందికి కలలో ఒక్కసారైనా కాకులు కనిపించే ఉంటాయి. అయితే కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది.? కాకులు కనిపిస్తే ఎలాంటి సంఘటనలకు సూచనో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో కాకులు కనిపిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయని కలల శాస్త్రంలో స్పష్టంగా వివరించారు...
రాత్రుళ్లు కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే కలలో వచ్చే అంశాలు మన జీవితంలో జరిగే అనేక సంఘటనలను సూచిస్తాయి. కలలో ఏం కనిపిస్తే ఏం జరుగుతుందో లాంటి వివరాలను కలల శాస్త్రంలో వివరించారు. మనలో చాలా మందికి కలలో ఒక్కసారైనా కాకులు కనిపించే ఉంటాయి. అయితే కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది.? కాకులు కనిపిస్తే ఎలాంటి సంఘటనలకు సూచనో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో కాకులు కనిపిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయని కలల శాస్త్రంలో స్పష్టంగా వివరించారు.
* సాధారణంగా కాకి అనగానే చాలా మంది భయపడతారు. కాకి యమధర్మరాజుగా భావిస్తారు. కలలో కాకులకు భయానక శబ్ధాలు చేస్తూ కనిపిస్తే ఇంట్లో ఏదైనా చెడు జరగడానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కలల శాస్త్రం చెబుతోంది.
* ఇదిలా ఉంటే కలలో మీ తలపైకి కాకి కూర్చున్నట్లు కనిపిస్తే అశుభానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇలా కనిపిస్తే ఏదో జరగకూడనిది జరుగుతుందని అంటున్నారు.
* ఇక కలలో ఎగిరే కాకి కూడా కనిపించకూడదని కలల శాస్త్రం చెబుతోంది. కలలో కాకి ఎగరడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కలలో ఎగిరే కాకి కనిపిస్తే మీరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అనేక ఇబ్బందులకు దీనిని సూచనగా చెబుతున్నారు. సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయని చెబుతున్నారు.
* కలలో కాకిని పట్టుకున్నట్లు కనిపిస్తే శుభ సూచకంగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది. కాకి ఇలా కనిపిస్తే మీ కుటుంబ అవసరాలు తీరడంతో పాటు, ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
* ఇక కలలో కాకులు నిత్యం కనిపిస్తుంటే పితృ దేవతలకు సంబంధించిన కర్మలు మిగిలి ఉన్నాయని అర్థం అన్నట్లు వాస్తు శాస్త్రం చెబుతోంది.