Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళి రోజున లక్ష్మీదేవికి ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదమో తెలుసా..!

దీపావళి పండగ సందడి మొదలైంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతి పూజ కోసం ఏర్పట్లు చేస్తున్నారు. అయితే లక్ష్మి గణపతికి కొన్ని రకాల ఆహారాన్ని అందించడం పవిత్రమైన చర్యగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఆరాధనలో లక్ష్మీ దేవి, గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించడం శుభప్రదం. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Diwali: దీపావళి రోజున లక్ష్మీదేవికి ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదమో తెలుసా..!
Diwali 2024
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 12:49 PM

Share

దీపావళి భారతదేశంలోని అతిపెద్ద పండగ. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని దీపాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ఇంటిలో దీపాలు వెలిగిస్తారు. చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం.. చీకటిని తొలగించి, కాంతికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. పవిత్రమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. అంతేకాదు పూజ అనంతరం ఆహారాన్ని సమర్పిస్తారు. దీపావళి రోజున అన్న వితరణ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారని ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

దీపావళి పండగ సమయంలో లక్ష్మీపూజ సమయంలో లక్ష్మీ దేవి, గణేషునికి ప్రత్యేక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తద్వారా లక్ష్మీదేవి గణపతిలు సంతోష పడతారని.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం. ఎందుకంటే ఎవరైనా ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేష్‌లకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలనే నియమం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవికి, గణేశుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం..

లక్ష్మీ దేవి, గణేశునికి ఏమి సమర్పించాలంటే

ఇవి కూడా చదవండి

స్వీట్లు: మోతీచూర్ లడ్డూలు, గులాబ్ జామూన్, బర్ఫీ, కోవా మొదలైన తీపి పదార్థాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఇవి కాకుండా పండ్లు, కొబ్బరి, తమలపాకులను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.

పాలు- స్వీట్లు పాలు, స్వీట్లను నైవేద్యంగా పెట్టడం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. కుంకుమపువ్వును పాలలో కలిపి సమర్పించవచ్చు.

పూల్ మఖానా పూల్ మఖానా సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల దీపావళి రోజున పూల్ మఖానాను లక్ష్మీదేవికి అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

సీతాఫలం సీతాఫలం సంపద , శ్రేయస్సు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. దీనిని లక్ష్మీదేవికి సమర్పించవచ్చు.

అరటిపండ్లు అరటిపండును కూడా శుభప్రదమైన ఫలంగా పరిగణిస్తారు. దీనిని వినాయకునికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

శనగపిండి లడ్డు గణేశుడికి మోదకం లేదా శనగపిండి లడ్డూలంటే చాలా ఇష్టం. వీటిని నైవేద్యంలో చేర్చడం శుభప్రదంగా భావిస్తారు.

దీపావళి ప్రాముఖ్యత

దీపావళి పండగ భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగలలో ఒకటి. దీపావళి పండగ అంటే అతి ముఖ్యమైన అర్థం చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ విజయాన్ని దీపావళి గుర్తు చేస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. విశ్వాసం ప్రకారం దీపావళి కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)