ధన్‌తేరాస్ 2022: ఈ పవిత్రమైన రోజున ఏం కొనాలి.. ఏం కొనకూడదో తెలుసుకోండి..

దీపావళి ధన్ తేరస్‌తో ప్రారంభమవుతుంది. సంపదలకు దేవతగా, కుబేరునిగా, లక్ష్మీదేవిగా, ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, ధంతేరస్ రోజున చేయకూడని లేదా కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి.

ధన్‌తేరాస్ 2022: ఈ పవిత్రమైన రోజున ఏం కొనాలి.. ఏం కొనకూడదో తెలుసుకోండి..
Dhanteras 2022
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 22, 2022 | 4:28 PM

ప్రస్తుతం పండుగల సీజన్‌ నడుస్తోంది. దీపావళికి ముందు వచ్చేది ధన్‌తేరాస్‌… సాధారణంగా ధనత్రయోదశి లేదా ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలువబడే ధన్‌తేరాస్‌..ఈ సంవత్సరం అక్టోబర్ 23న వచ్చింది ఈ పవిత్రమైన పండుగ. ధన్‌తేరస్ అనే పదం ధన్ మరియు తేరాస్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. ధన్ అంటే సంపద, తేరాస్ అనేది 13వ రోజు. ధన్తేరస్ అనేది కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున వస్తుంది. ధన్‌తేరాస్ ఐదు రోజుల దీపావళి పండుగకు ఆరంభంగా జరుపుకుంటారు. ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన్ తేరస్‌, రెండవ రోజు నరక చతుర్దశి,మూడవ రోజు దీపావళి,నాల్గవ రోజు గోవర్ధన్ పూజ,ఐదవ రోజు అన్నా చెల్లెల పండగ. 23 అక్టోబర్ 2022న ధన్ తేరస్‌ వచ్చింది. ధన్ తేరస్‌ నాడు పూజలు చేయడం వలన సంపద కలుగుతుంది. అలానే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం.

దీపావళి ధన్ తేరస్‌తో ప్రారంభమవుతుంది. సంపదలకు దేవతగా, కుబేరునిగా, లక్ష్మీదేవిగా, ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ధన్‌తేరాస్‌లో పూజలు చేయడం వల్ల సంపద, ఆహారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ రోజున, శివుని అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ధన్వంతరి భగవానుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే ధన్వంతరి జన్మదినాన్ని కూడా ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు. ఈ రోజున ఏదైనా వస్తువును కొనుగోలు చేయడం ఒక సంవత్సరం పాటు ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందని చెబుతారు. అందుకే ప్రజలు కానుకలు, బంగారం, పాత్రలు, ఆభరణాలు అమ్మవారికి ఇష్టంగా కొనుగోలు చేస్తారు. ఆమె భక్తుడికి మరింత సంపదను ప్రసాదిస్తుంది. అయితే, ధంతేరస్ రోజున చేయకూడని లేదా కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఒకవేళ మీకు దాని గురించి తెలియకుంటే ఈ స్టోరీని చదవండి. ప్రత్యేకంగా మీ కోసం..ధన్‌తేరాస్‌ రోజున ఏం కొనాలి. దేనికి దూరంగా ఉండాలి అనే జాబితా ఇక్కడ ఉంది!..

ధన్‌తేరాస్ 2022లో కొనుగోలు చేయాల్సిన వస్తువులు.. ధన్‌తేరస్‌లో చీపురు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంటి నుండి అన్ని కష్టాలను తుడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయండి. వాటిని మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచండి. ధన్‌తేరస్‌లో ఇత్తడితో చేసిన వెండి వస్తువులు లేదా పాత్రలను కొనుగోలు చేయండి. మీరు బంగారు నాణేలను కొనుగోలు చేయలేకపోతే, వెండి నాణేలు కూడా ప్రయోజనాన్ని అందిస్తాయి. మీ ఇంటికి ఫర్నిచర్ కొనండి.

ఇవి కూడా చదవండి

ధన్‌తేరాస్ 2022లో ఏమి కొనకూడదు?.. కత్తెర, కత్తులు, పిన్స్ వంటి పదునైన వస్తువులను కొనడం మానుకోండి. నలుపు రంగులో ఉన్న వస్తువులను కొనుగోలు చేయవద్దు. ధన్‌తేరాస్ పవిత్రమైన రోజు. నలుపు దురదృష్టాన్ని సూచిస్తుంది.. కాబట్టి, దీనికి దూరంగా ఉండాలి. గాజుతో చేసిన ఏ వస్తువునూ కొనకండి. కారు కొనకండి. ఇది కూడా రాహువుతో ముడిపడి ఉన్నందున అల్యూమినియం పాత్రలను కొనడం మానుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!