వ్యాపారి ఇంట్లో సోదాలు.. కారు, బెడ్ రూమ్‌లో దొరికిన సొమ్ము చూసి కళ్లు తేలేసిన అధికారులు

అపార్ట్‌మెంట్‌ఫ్లాట్‌లోకి ప్రవేశించిన ప్రభుత్వ అధికారులు.. అట్ట పెట్టెల్లో, మంచాల కింద కట్టల కొద్దీ కనిపించిన నోట్ల కట్లలు చూసి కంగుతిన్నారు. మొత్తం కోట్లల్లో గుర్తించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వ్యాపారి ఇంట్లో సోదాలు.. కారు, బెడ్ రూమ్‌లో దొరికిన సొమ్ము చూసి కళ్లు తేలేసిన అధికారులు
Rs.8 Crore Cash
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 22, 2022 | 3:59 PM

ఓ అపార్ట్ మెంట్ బెడ్ కింద ఉంచిన అట్ట పెట్టె, బయట పార్క్ చేసిన కారులో దాచిన పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం హౌరా జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఓ వ్యాపారికి చెందిన అపార్ట్‌మెంట, కారులో సుమారు రూ. 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. ఇల్లు, కారు, అట్ట పెట్టె, మంచాల్లో మొత్తం రూ.8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఇద్దరు సోదరులకు చెందిన అపార్ట్‌మెంట్లలో 8 కోట్లు దొరినట్టుగా పోలీసులు తెలిపారు. నగదుకు సంబంధించి శైలేష్ పాండే, అరవింద్ పాండే, రోహిత్ పాండే అతని సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను శనివారం (ఏ.22) మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

అపార్ట్‌మెంట్‌ఫ్లాట్‌లోకి ప్రవేశించిన ప్రభుత్వ అధికారులు.. అట్ట పెట్టెల్లో, మంచాల కింద భారీగా డబ్బును గుర్తించారు. వ్యాపారవేత్తలు శైలేష్ పాండే మరియు అరవింద్ పాండేలు శిబ్‌పూర్ ప్రాంతంలోని ఖరీదైన నివాస సముదాయంలో ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు. దాడి జరిగిన సమయంలో వ్యాపారి కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న ఈ ఇద్దరు వ్యాపారులు భారీ మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు 2 బ్యాంకులకు అక్టోబర్ 14న సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోల్‌కతా పోలీస్ డిటెక్టివ్ డివిజన్‌లోని యాంటీ బ్యాంక్ ఫ్రాడ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. కోల్‌కతా పోలీసులు ఈ సోదరులపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. పెద్ద మొత్తంలో ఉన్న 2 బ్యాంకు ఖాతాలు కూడా వెరిఫై చేశారు. కాగా, పోలీసులు రంగంలోకి దిగిన మరుక్షణమే ఈ నలుగురు సోదరులు పరారీలోకి వెళ్లిపోయారు. కాగా, వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలించి ముమ్మరం చేసిన పోలీసులు ఎట్టకేలకు వీరిని గుజరాత్, ఒడిశాలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!