Tirumala laddu row: తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు.. జగన్‌ పర్యటన రద్దవడంతో తొలగింపు

తిరుమలలో లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ సిఎం జగన్ తిరుమల తిరుపతి క్షేత్రానికి కాలి నడకన పయనం అయ్యారు. ఈ నేపధ్యంలో తిరుమల క్షేత్రంలో ఉదయం ఉన్నట్లుండి డిక్లరేషన్‌ బోర్డులు వెలిశాయి. అయితే సాయంత్రానికి అవన్నీ మాయమైపోయాయి. దీని భావమేమి తిరుమలేశా అంటున్నారు భక్తులు.

Tirumala laddu row: తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు.. జగన్‌ పర్యటన రద్దవడంతో తొలగింపు
Jagan Tirumala Visit
Follow us

|

Updated on: Sep 27, 2024 | 9:29 PM

తిరుమల కొండపై కొత్తగా డిక్లరేషన్ బోర్డులు వెలిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఆలయాల్లో హైందవేతరుల ప్రవేశం గురించి నిబంధనలు ప్రకటిస్తూ తిరుమల కొండపై పలు చోట్ల పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. హిందువులు కాని వ్యక్తులు తిరుమల ఆలయానికి రావాలనుకుంటే, తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సిందేనని వాటిలో స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వరుని పట్ల తమకు విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన గురించి మరోసారి ఆ డిక్లరేషన్‌ బోర్డుల్లో గుర్తు చేశారు.

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయం, అదనపు కార్యనిర్వాహణాధికారి క్యాంప్ కార్యాలయం ప్రాంతాల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈమేరకు తిరుమలలో 4 నోటీసు బోర్డులు వెలిశాయి. వైకుంఠం -17 దగ్గర గతంలోనే డిక్లరేషన్‌ బోర్డ్‌ ఉంది. జగన్‌ పర్యటన నేపథ్యంలో మరో 3 బోర్డులు వెలిశాయి. వైకుంఠం -2, వైకుంఠం సర్కిల్‌, జేఈవో ఆఫీస్‌ దగ్గర ఈ డిక్లరేషన్‌ బోర్డును ఏర్పాటు చేసింది టీటీడీ.

మరోవైపు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన కాసేపటికే తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోర్డులను టీటీడీ సిబ్బంది తొలగించడం గమనార్హం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర ఏర్పాటుచేసిన బోర్డు మినహా అన్నిచోట్ల బోర్డులను తీసివేసింది టీటీడీ. జగన్‌ పర్యటన రద్దవడంతో వాటిని టీటీడీ తొలగించిందనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..

వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే

కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!

ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి

మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి

గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే

హీరోయిన్ల జాతకం మారిపోవాలంటే తెలుగు సినిమా చెయ్యాల్సిందే!ప్రియాంక
హీరోయిన్ల జాతకం మారిపోవాలంటే తెలుగు సినిమా చెయ్యాల్సిందే!ప్రియాంక
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!