మత సామరస్యంలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు టిబెట్‌కు చెందిన దలైలామా తెలిపారు. శ్రీలంకన్ టిబెటన్ బుద్ధిస్ట్ సొసైటీ ‘Unduvap Full Moon Poyaday’ పేరుతో వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇండోనేషియా, మలేసియా, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిల్యాండ్‌కు చెందిన వందలాది మంది బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా హిమాచల ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దలైలామా. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానలిచ్చారు. అదేవిధంగా బుద్ధుడి బోధనల గురించి వారికి వివరించారు. ‘భారతీయ మత సంప్రదాయం అహింసను బోధిస్తుంది. ఇతరులకు హాని కలిగించొద్దని అన్ని మతాలు చెబుతున్నాయి. భారతదేశ ప్రజలు అహింసా, కరుణ, దయ తదితర వాటిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఇస్లాం, క్రిష్టియానిటీ, జైనులు, యూదులు.. ఇలా ఎన్నో మతాలకు చెందిన వారందరు కలిసిమెలసి ఇక్కడ జీవిస్తున్నారు. ‘
‘నేను శరణార్థిగా భారతదేశంలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలను గమనిస్తున్నాను. వారు అహింస, మత సామరస్యం తదితర వాటిని పాటిస్తున్నారు. మత సామరస్యం విషయంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శి. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఇండియానే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఇక బుద్ధుడి బోధనలను విశ్లేషించే స్వేచ్ఛ ఆయనే మనకు ఇచ్చాడు. ఆయన బోధనలను ఎంత ఎక్కువగా విశ్లేషిస్తే అన్ని నిజాలు మనకు తెలుస్తాయి’ అని దలైలామా పేర్కొన్నారు. అయితే కొన్ని రోజులుగా చైనాపై వరుసగా విమర్శలు చేస్తున్నారు దలైలామా. ముఖ్యంగా అక్కడి నాయకత్వం ఆధిపత్యం చెలాయించడానికే ప్రయత్నిస్తోందన్నారు. అయితే ఓ వ్యక్తిగా చైనా ప్రజలకు తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన పేర్కొన్నారు.
Also Read:
Tamilnadu: చోరీ చేసిన బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే..
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..