కణకణలాడే నిప్పుల్లో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు.. కన్నులపండువగా చెర్వుగట్టు జాతర..!
నల్లగొండ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్ని గుండాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కణకణలాడే నిప్పుల్లో నడిచి భక్తులు ముక్కులు తీర్చుకున్నారు. పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల విశ్వాసం.

నల్లగొండ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి 7) తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కణకణలాడే నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో చెర్వుగట్టు జనసంద్రంగా మారింది.
చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి సమేతంగా ఉన్న స్వామిని పర్వత వాహనంపై మంగళ వాద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం వీరముష్టి వంశీయులతో మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పుకనికల (అగ్ని గుండాలు)పై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి ఏటా కళ్యాణం తరువాత తాము పండించిన పంటను స్వామి వారికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల విశ్వాసం. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, అగ్ని గుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగి పోతాయని భక్తులు చెబుతున్నారు. కోరిన కోరికలు తీరిన తర్వాత అగ్ని గుండాలపై నడిచి మొక్కులు తీర్చుకున్నామని భక్తులు చెబుతున్నారు. ప్రతి ఏటా మొక్కులు తీరిన తర్వాత అగ్నిగుండాలపై నడుస్తామని భక్తులు చెబుతున్నారు. వీడియో చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..