Lunar Eclipse: సెప్టెంబర్‌లో ఏర్పడనున్న చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా?
సంవత్సరంలో చివరిది, రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ ప్రారంభంలో జరగబోతోంది. ఈ గ్రహణం పౌర్ణమి తిథి రోజున ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం భారత దేశంలో కూడా కనిపించనున్న నేపధ్యంలో గ్రహణం సమయంలో ఏయే విషయాలు జాగ్రత్తగా ఉండాలి? ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం..

చంద్రగ్రహణం హిందూ మతంలో ఒక ఆధ్యాత్మిక సంఘటన. దీనికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రగ్రహణం సమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం త్వరలో ఏర్పడనుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. అందుకనే చంద్ర గ్రహణ సమయంలో సూత కాలంలో చెల్లుతుంది.
సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. పౌర్ణమి రోజున భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో చంద్రునిపై పడే సూర్యకాంతిని భూమి అడ్డుకుంటుంది.
2025 సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే
ఆదివారం సెప్టెంబర్ 7, 2025న భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 గంటలకు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది.
2025 చంద్రగ్రహణంలో సూత కాలం
చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూత కాలము ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7న 12.19 నిమిషాలకు సూత కాలము ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. సూత కాలము సమయంలో, పూజలు, అధ్యతిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు, రోగులు సూత కాలము సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
సూత కాలంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే
- సూతక కాలంలో అనేక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించబడవు.
- ఈ సమయంలో గుడి తలుపులు కూడా మూసివేయబడతాయి. పూజలు నిర్వహించబడవు.
- గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు.
- ఈ సమయంలో మంత్రాలను జపిస్తూ, దేవుని నామాన్ని జపించండి.
- ఈ సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించవద్దు.
- ఈ సమయంలో ఆహారం వందవద్దు.. తినవద్దు.
- సూతక కాలానికి ముందు తయారుచేసిన ఆహారం, పాలు మొదలైన వాటిలో తులసి దళాలను, దర్భలను వేయండి.
- గ్రహణం ముగిసిన తర్వాత అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి శుద్ధి చేసుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








