Chanakya Niti: ఈ 5 పరిస్థితులు ప్రతి వ్యక్తికి చాలా బాధను కలిగిస్తాయి.. అవేంటంటే..

|

Jan 20, 2022 | 7:48 AM

Chanakya Niti: ఆచార్య చాణక్య ప్రకారం.. పలు సందర్భాల్లో ఒక వ్యక్తి మనసు విచ్ఛిన్నం అవుతుంది.

Chanakya Niti: ఈ 5 పరిస్థితులు ప్రతి వ్యక్తికి చాలా బాధను కలిగిస్తాయి.. అవేంటంటే..
Chanakya
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్య ప్రకారం.. పలు సందర్భాల్లో ఒక వ్యక్తి మనసు విచ్ఛిన్నం అవుతుంది. కానీ వారు తమలో ఎంత బాధ ఉన్నప్పటికీ ఎదుటి వారితో చెప్పుకోలేకపోతారు. అలా మనసు విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల గురించి ఆచార్య చాణక్య కొన్ని విషయాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒక వ్యక్తి తన బంధువు, స్నేహితుడు లేదా మరెవరైనా తీవ్ర అవమానానికి గురి చేసినప్పుడు మనసు విచ్ఛిన్నమవుతుంది. ఆ అవమాన భారంతో తీవ్రంగా దహించుకుపోతారు. కానీ ఈ అవమానాన్ని వారు ఎవరికీ చెప్పుకోరు, మరిచిపోలేరు.

2. ఆచార్య చాణక్య కూడా పేదరికాన్ని పెద్ద శాపంగా భావించారు. ఒక వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడైతే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో కొన్ని అవమానాలు, బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి లోలోపల కుమిలిపోతాడు.

3. భార్యను అమితంగా ప్రేమించే వ్యక్తి, ఏ కారణం చేతనైనా ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ వ్యక్తికి ఈ పరిస్థితి చాలా బాధాకరం. చాలా మంది ఈ ఎడబాటును భరించలేక డిప్రెషన్‌కు గురవుతుంటారు.

4. మీరు ఎవరికైనా సహాయం చేస్తే, మీకు అవసరమైనప్పుడు ఆ వ్యక్తి మీ వైపు కనీసం తిరిగి చూడనట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మోసం అతన్ని మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతుంది.

5. ఒక వ్యక్తి అప్పుల భారంతో సతమతమవుతుంటే, అతని తలపై భారీ భారం ఉన్నందున అతను క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేడు. ఆ అప్పు తీసేంత వరకు వరకు అతని బాధ తీరదు.

Also read:

Giant Egg Roll: స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తున్న భారీ ఎగ్ రోల్.. ముఫై గుడ్లతో తయారీ.. వీడియో వైరల్..

Saamanyudu Trailer Talk: సామాన్యుడు ట్రైలర్ టాక్.. మరోసారి అదరగొట్టిన విశాల్..

Tax Saving Tips: సెక్షన్ 80C ఉపయోగించకుండా ఆదాయపు పన్ను ఆదా చేయడం ఎలా? ఇందు కోసం 10 చిట్కాలు ఇవే..