AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదుగురితో స్నేహం చేయడం అంటే మీ పతనాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే..

ఆచార్య చాణక్య ఆధ్యాత్మిక వేత్త. రాజనీతిజ్ఞుడు. తక్షశిల అధ్యాపకుడు. చాణక్య మానవ జీవితం గురించి రకరకాల విషయాలను వెల్లడించాడు. కొంతమంది వ్యక్తుల నుంచి దూరం పాటించడం ముఖ్యమని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పాడు. తద్వారా మనిషి మానసిక ప్రశాంతతను, సరైన సంబంధాలను ఆస్వాదించగలడు అని చెప్పారు. ఈ 5 రకాల వ్యక్తులు మీ జీవితంలో గందరగోళాన్ని తీసుకుని వస్తారు.

Chanakya Niti: ఈ ఐదుగురితో స్నేహం చేయడం అంటే మీ పతనాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే..
Chanakya Niti
Surya Kala
|

Updated on: May 04, 2025 | 8:19 PM

Share

పండితుడు చాణక్య రాసిన చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణంలో చూసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. జీవితంలోని అనేక ముఖ్యమైన, ఉపయోగకరమైన వివిధ అంశాలను వివరిస్తుంది. జీవితంలో కొంతమంది నమ్మదగినవారు కారు కనుక వారితో స్నేహం చేయకూడదని కూడా ఒక ముఖ్యమైన పాఠంగా చాణక్య నీతిలో చెప్పబడింది. చాణక్యుడి ప్రకారం కొందరి వ్యక్తులు మోసం చేయడానికి మాత్రమే ఉంటారు. వారితో స్నేహం చేయడం వల్ల మానసికంగానే కాదు భావోద్వేగానికి కూడా హాని కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి విలువైనవారు కారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎప్పుడూ స్నేహం చేయకూడని 5 రకాల వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

జీవితంలో మనకు హాని కలిగించే వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పేవారు, స్వార్థపరులు , అసూయపడేవారు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరని చాణక్య చెప్పాడు.

అబద్ధం చెప్పే వారు: చాణక్యుడి చెప్పిన ప్రకారం ఎప్పుడూ అబద్ధం చెప్పే వారితో స్నేహం చేయకూడదు. అబద్ధం చెప్పే వ్యక్తితో ఏ సంబంధంలోనూ స్థిరత్వం ఉండదు. అలాంటి వారు తమ స్వలాభం కోసమే అబద్ధాలు చెబుతారు. వీరు సమయం వచ్చినప్పుడు మోసం కూడా చేయగలరు.

ఇవి కూడా చదవండి

ఇచ్చిన మాట తప్పేవారు: ఎటువంటి స్థిరమైన ఆలోచనలు లేనివారు.. తాము ఇచ్చిన మాటని తప్పి వెనక్కి తగ్గే వ్యక్తులు ఎప్పటికీ నమ్మదగినవారు కారు. ఎవరైనా తాము ఇచ్చిన మాటను పదే పదే వెనక్కి తగ్గినప్పుడు, అతని ఉద్దేశాలు ప్రశ్నార్థకంగా మారతాయి. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ సంబంధాన్ని అయినా మార్చుకుంటారు. వీరి సహవాసంఎప్పుడూ ప్రమాదకరమే.. ఇతరులకు ద్రోహం చేయవచ్చు

స్వార్థపరులు : స్వార్థపరులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. అలాంటి వ్యక్తులు తమ సొంత శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇతరుల భావాలను గౌరవించరు. వీరి సంబంధాలలో తమ సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. వీరి పని పూర్తయిన తర్వాత ఇతరులను వదిలివేస్తారు. ఇలాంటి స్వార్ధపరులు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు. మోసం చేయడంలో నిపుణులు. అలాంటి వారితో స్నేహం చేయడం ముప్పు అని చెప్పాడు చాణక్య

మీ విజయం చూసి అసూయపడేవారు: మీ విజయాన్ని చూడలేని కొంతమంది మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. చాణక్యుడి ప్రకారం అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మీకు మంచి స్నేహితులు కాలేరు. ఈ వ్యక్తులు మీ విజయం చూసి అసూయపడతారు. వారికి అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని కించ పరచడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బలహీనపడి.. మీరు వెళ్ళే మార్గంలో అడ్డంకులు ఏర్పడతాయి. అసూయ పరులు ఎదుటివారి వైఫల్యాన్ని మాత్రమే కోరుకుంటారు. కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.