ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు, ఆర్ధిక వేత్త, వ్యుహకర్త. ఆయన రాసిన ‘చాణక్య నీతి’లో జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఆయన చెప్పిన నీతి సూత్రాలు పాటించడానికి కష్టంగా ఉన్నా.. అవి మనల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తాయి. జీవితాన్ని ఎలా సులభతరం చేసుకోవాలన్న విషయాలు చాణక్యుడు అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఏదైనా పనిని తలపెట్టే ముందు ఈ 5 విషయాలు గుర్తించుకోవాలని చాణక్య నీతి పేర్కొంటోంది. ఇవి పాటిస్తే ఎలాంటి పెద్ద సమస్యకైనా చిటికెలో పరిష్కారం లభిస్తుందట. ఒక పనికి శ్రీకారం చుట్టేటప్పుడు ప్రతీ వ్యక్తి తన సామర్ధ్యంపై నమ్మకం ఉంచుకోవాలని ఆచార్య చాణక్యుడు వివరించారు.
ఆ పనిని తలపెట్టే ముందు మొదటిగా తనకు తాను మూడు ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. అసలు ఎందుకు ఈ పని చేస్తున్నాం.? ఫలితం ఏం రాబోతుంది.? విజయం సాధించగలనా.? ఈ మూడు ప్రశ్నలకు మీ దగ్గర సరైన సమాధానాలు ఉన్నప్పుడు.. ఎలాంటి పనినైనా సంకోఛం లేకుండా ప్రారంభించగలరు.
మరోవైపు ఈ అంశం కొంచెం కఠినమైనదే అయినా.. లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు తప్పక పాటించాల్సిందే. ఎలాంటి బంధానికి ఎక్కువగా ఎటాచ్ అవ్వకూడదని చాణక్య తెలిపారు. అది మిమ్మల్ని బలహీనుడిని చేయడమే కాకుండా లక్ష్యానికి ఆటంకంగా మారుతుందని చెప్పారు. దుఃఖాలకు కూడా అదే కారణం అవుతుందని వివరించారు.
సంపద, స్నేహితులు, లేదా ఇతరత్రా విషయాలు ఏదైనా కూడా మనం తిరిగి పొందగలం. కానీ ఆరోగ్యాన్ని మాత్రం కాదు. ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని.. ఆరోగ్యవంతులు దేనినైనా సాధించగలరని చాణక్య చెప్పారు. కాగా, సమతుల్యమైన మనస్సు, సంతృప్తి, దయాగుణం.. ఇవన్నీ కూడా జీవితంలో చాలా ముఖ్యం. ఈ మూడు ఉంటే దురాశ దరికి చేరదని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు.
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..