Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

Today Horoscope: భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు...

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 26, 2021 | 6:05 AM

Today Horoscope: భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

మేషరాశి: ప్రారంభించే పనులలో ఆలస్య కానివ్వకుండా చూసుకోండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువుగా ఉండటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. గొంతు సంబంధిత సమస్యలు ఉండవచ్చు.

వృషభ రాశి: కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేడు అనవసర ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు.

మిథున రాశి: శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేస్ఆతరు. చేపట్టే పనులలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని కారణాల వల్ల మీరు చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీరు ఆ సమస్యకు పరిష్కారం పొందవచ్చు.

కర్కాక రాశి: ముఖ్యమైన విషయాలలో సంబంధిత పెద్దలను కలుసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. కొంతమంది ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

సింహ రాశి: ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.

కన్య రాశి: ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు.

తుల రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు.

వృశ్చిక రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు ఉండే అవకాశం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు ఉత్సాహ పరుస్తాయి.

మకర రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

కుంభ రాశి: పెట్టిన పెట్టుబడులలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి

మీన రాశి: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు.

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..