Chanakya Niti: కుటుంబ సభ్యుల మధ్య ఈ అలవాట్లే కలహాలకు కారణం అంటున్న చాణక్య

గొప్ప రాజనీతిజ్ఞుడు, విజ్ఞాన ఖని అయిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం రచించాడు. ఈ నీతి శాస్త్రంలో కుటుంబ విభేదాల వెనుక ఉన్న లోతైన కారణాలను వివరించాడు. అతని ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కేవలం మాటలు లేదా సంఘటనల వల్ల కాదు.. అలవాట్లు, ఆలోచనల ఘర్షణల వల్ల సంభవిస్తాయి. చాణక్య చెప్పిన కుటుంబ కలహాలకు గల కారణాలను సకాలంలో అర్థం చేసుకుంటే.. ఆ కుటుంబంలో ప్రేమ, సమతుల్యత ఎప్పుడూ ఉంటుంది.

Chanakya Niti: కుటుంబ సభ్యుల మధ్య ఈ అలవాట్లే కలహాలకు కారణం అంటున్న చాణక్య
Chaankya Niti

Updated on: Jul 17, 2025 | 12:21 PM

ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎటువంటి కారణాలు లేకుండా తగాదాలు ప్రారంభమవుతాయి. సంబంధాల మధ్య ఉద్రిక్తత పెరగడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో శాంతి విచ్ఛిన్నమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ గొడవల్లో ఎవరి తప్పు? ఎవరి కారణంగా గొడవలు జరుగుతున్నాయి అని ఆలోచిస్తాం. అయితే ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో కుటుంబంలో విభేదాలకు గల లోతైన కారణాలను వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఈ విషయాల వలన కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు కేవలం మాటలు లేదా సంఘటనల వల్ల కాదు.. కుటుంబ సభ్యుల మధ్య అలవాట్లు, ఆలోచనల వలన ఘర్షణలు సంభవిస్తాయి. చాణక్య మాటలను సకాలంలో అర్థం చేసుకుంటే.. ప్రేమ, సమతుల్యత ఎల్లప్పుడూ కుటుంబంలో ఉంటాయి.

స్వార్థం పెరుగుదల
కుటుంబ సభ్యులు తమ గురించి మాత్రమే ఆలోచించడం ప్రారంభించినప్పుడు.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. స్వార్థం కుటుంబ సభ్యుల సంబంధాలను విషపూరితం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రయోజనం కోసం మాత్రమే ఆలోచిస్తే.. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అంతమవుతుంది. కనుక కుటుంబ సభ్యుల్లో త్యాగగుణం, సహకారం చాలా ముఖ్యమైనవి.

డబ్బు, సంపదపై దురాశ
చాణక్యుడి ప్రకారం డబ్బు అంటే దురాశ అతిపెద్ద శత్రువు. డబ్బు విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు, గొడవలు పెరుగుతాయి. కుటుంబ నిర్ణయాలు పరస్పర అవగాహన, నమ్మకంతో తీసుకోవడం ముఖ్యం. దురాశ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒకరినొకరు విస్మరించడం
కుటుంబ సభ్యులు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోనప్పుడు మనస్సులో దూరం పెరగడం ప్రారంభమవుతుంది. గౌరవం, సంభాషణ ప్రతి సంబంధానికి పునాది అని చాణక్యుడు చెప్పాడు. ఎవరైనా తమ మాట కుటుంబ సభ్యులు వినకపోతే.. వారు కుటుంబంలో ఒంటరి అని భావిస్తారు. ఇది సంఘర్షణకు అవకాశం పెంచుతుంది.

బయటి వ్యక్తుల జోక్యం
చాణక్య నీతి ప్రకారం కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల జోక్యం సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇతరులు తమ మాటలతో కుటుంబ సభ్యులను రెచ్చగొట్టడం ప్రారంభించినప్పుడు.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబందించిన నిర్ణయాలు కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి. బయటి వ్యక్తుల జోక్యం కారణంగా వారి మధ్య ఉన్న నమ్మకం విచ్ఛిన్నమవుతుంది.

అబద్ధం చెప్పడం, మోసం చేయడం
అబద్ధాలు, మోసం చేసే గుణం కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను బలహీనపరుస్తాయి. నిజం లేని చోట శాంతి ఉండదని చాణక్యుడు చెప్పాడు. అబద్ధం అనేక సంబంధాలను నాశనం చేస్తుంది. కుటుంబంలో పారదర్శకత, నిజాయితీ అవసరం.

అహంకారం, కోపం
కోపం, అహంకారం అతిపెద్ద విధ్వంసకారి అని చాణక్యుడు చెప్పాడు. ఎవరైనా కుటుంబ సభ్యుడు తాను సరైనవాడినని, గొప్పవాడిని అని భావిస్తూ.. కుటుంబంలోని ఇతరులను తక్కువ చేసినప్పుడు.. ఆ కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి. వినయం, సహనం కుటుంబాన్ని కలిపి ఉంచుతాయి. కోపంతో కాదు.. జ్ఞానంతో ప్రతిదానికీ సమాధానం చెప్పాలని చెప్పాడు చాణక్య.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.