AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం, ఎందుకో తెలుసా

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దేవాలయం.. శ్రీశైలం. మలన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది భక్తులు దర్శనం కు ముందు నదీస్నానం చేసేందుకు ఇష్టం చూపుతుంటారు. కానీ వచ్చే రోజుల్లో భక్తులు నది స్నానం చేసే వీలు ఉండదు.

Srisailam: శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం, ఎందుకో తెలుసా
Srisailam
Balu Jajala
|

Updated on: Feb 21, 2024 | 9:35 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దేవాలయం.. శ్రీశైలం. మలన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది భక్తులు దర్శనం కు ముందు నదీస్నానం చేసేందుకు ఇష్టం చూపుతుంటారు. కానీ వచ్చే రోజుల్లో భక్తులు నది స్నానం చేసే వీలు ఉండదు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పరిమితంగా ఉండటంతో రానున్న మహా కుంభాభిషేకం, శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు స్నానాలు చేసేందుకు అధికారులు షవర్లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 38.8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ఆనకట్ట దేశంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం. నీటి మట్టం తగ్గడంతో ఇప్పటికే జల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. అయితే ఈ ఏడాది మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే కుంభాభిషేకం, శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు కృష్ణా జలాల్లో స్నానమాచరించటం ఆనవాయితీగా వస్తోంది. నీటిమట్టం 38.8 టీఎంసీలు కాగా, 960 క్యూసెక్కుల స్వల్ప ఔట్ ఫ్లో మాత్రమే ఉంది. దీంతో రాజుల సత్రం, ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న పాతాళగంగ స్నానఘట్టాల వద్ద షవర్లు ఏర్పాటు చేసి భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా నీటిని కూడా సంరక్షించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. ఆనకట్ట దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో మహా కుంభాభిషేకం వేడుకలను దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మహా కుంభాభిషేక మహోత్సవ క్రతువులు ఐదవ రోజుకు చేరుకుంది. ఉదయం శాస్త్రబద్ధంగా పూజల క్రతువులు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభాభిషేక పూజాది కార్యక్రమాలను పురస్కరించుకొని స్వామి అమ్మ వార్లకు ప్రతిరోజు విశేష పూజలు, దేవత హవములు, దేవా హవాములు, జపాలు, పారాయణం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21న మహా కుంభాభిషేకం చివరి రోజు.. ఆఖరు పూజా మహోత్సవంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ పండితారాధ్య శివచార్య మహా స్వామీజీ, పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతి తో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్ననున్నారు.