ఈ ఆలయంలో సౌండ్ చేయడం నిషేధం.. గంటలు, హారతి, కీర్తనలకు దూరం ఎందుకంటే

|

Aug 07, 2024 | 10:21 AM

మధుర బృందావన్‌లోని పురాతన బాంకే బిహారీ ఆలయం వివిధ రకాల రహస్యాలతో నిండి ఉంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి బాల కృష్ణుడి దర్శనం చేసుకోవాలనే కోరికతో వస్తుంటారు. పురాణాలు, గ్రంధాల ప్రకారం శ్రీకృష్ణుడు బాల రూపంలో ఈ ధామంలో నివసిస్తున్నాడు. బృందావన్‌లో శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో సౌండ్ చేయడం నిషేధం.. గంటలు, హారతి, కీర్తనలకు దూరం ఎందుకంటే
Banke Bihari Temple
Follow us on

మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లో నేటికీ మనవ మేథస్సుకు అందని సైన్స్ చేధించని మిస్తారీలు దాగున్నాయి. వాటిల్లో ఒకటి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం. ఈ ఆలయం అనేక రహస్యాలు, ఆచారాలతో నిండి ఉంది. ఈ పవిత్ర ఆలయంలో (శ్రీ బంకే బిహారీ స్వామి ఆలయం) శ్రీకృష్ణుడు బాల రూపంలో ఉంటాడు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని సేవిస్తే.. భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది.

మధుర బృందావన్‌లోని పురాతన బాంకే బిహారీ ఆలయం వివిధ రకాల రహస్యాలతో నిండి ఉంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి బాల కృష్ణుడి దర్శనం చేసుకోవాలనే కోరికతో వస్తుంటారు. పురాణాలు, గ్రంధాల ప్రకారం శ్రీకృష్ణుడు బాల రూపంలో ఈ ధామంలో నివసిస్తున్నాడు. బృందావన్‌లో శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం బాంకే బిహారీ టెంపుల్ కి సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాల గురించి తెసుకుందాం..

బాంకే బిహారీ ఆలయ సంప్రదాయాలలో ఒకటైన గంటలు ఉండవు. ఆలయం లోపల నిరంతర భజనలు, కీర్తనలు వినిపించవు. అంతేకాదు ఈ అద్భుతమైన ప్రదేశంలో ఎవరైనా బిగ్గరగా పాటలు పాడలేరు, హారతి కూడా ఇవ్వలేరు. వీటికి కారణం కన్నయ్య పట్ల ఉన్న ప్రేమ, భక్తి మాత్రమే.. అందుకనే ఉదయం కృష్ణుడిని మేల్కొలపడానికి పెద్ద శబ్దం చేయరు.. ఆలయ గంటలు ఉపయోగించని ఏకైక ఆలయం. ఎందుకంటే పిల్లవాడిని నిద్రలేపడానికి ఇలాంటి పద్దతి సరైనది కాదు. వారిని మెల్లగా మేల్కొలపాలని చెబుతారు.

ఇవి కూడా చదవండి

అవును ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్లి అకస్మాత్తుగా గంట మోగించడం లేదా భజనలు, కీర్తనలు పాడటం, అతి బిగ్గరగా పాడటం ప్రారంభించినట్లయితే ఏమి జరుగుతుంది? నిద్రావస్థలో ఉన్న శిశువు ఉల్కి పడతాడు.. కలత చెంది ఏడుస్తాడు. అందుకనే చిన్నారి కన్నయ్య కొలువైన ఈ బాంకే బిహారీ ఆలయంలో గంటలు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

శ్రీకృష్ణుడు బాలగోపాలుని రూపంలో ఈ ధామంలో ఉన్నాడు . గంటలు మోగించడం వలన అతని నిద్ర భంగం అవుతుంది. నిద్రలో ఉల్కి పడి కలవరపడతాడు. కనుక కన్నయ్య మీద ఉన్న భక్తీ, ప్రేమతో ఈ మందిరంలో గంటలు ఏర్పాటు చేయలేదు. వాటిని మోగించడం కూడా ఇక్కడ నిషేధం. ఈ చిరకాల సంప్రదాయం భక్తుల హృదయాల్లో భగవంతునిపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు