Ayodhya Ram Temple: రామయ్య తొలి హారతి కోసం 600 కిలోల నెయ్యి, జోధ్ పూర్ నుంచి 108 రథాల్లో అయోధ్యకు
రామాలయంలో రామయ్యకు ఇవ్వనున్న మొదటి హారతికి, మహాయజ్ఞానికి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యిను పంపుతూ మరోసారి జోధ్ పూర్ వాసులు రామ భక్తుల మదిలో చిరస్థాయిగా నిలుస్తున్నారు. రామయ్య కొలువుదీరనున్న ఆలయంలో దేశీ ఆవు నెయ్యితో తొలి అఖండ దీపం వెలిగిస్తారు. దీంతోపాటు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జరిగే మహాయజ్ఞంలో జోధ్‌పూర్ నుంచి తీసుకొచ్చిన నెయ్యి, హవన సామగ్రినే నైవేద్యంగా సమర్పించనున్నారు.
హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మ భూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 2024లో ఈ ఆలయం ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. అప్పటి నుంచి రామ భక్తులు రామయ్యని దర్శించుకోవచ్చు. ఇప్పటికే రామాలయ ప్రారంభోత్సవం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రామ మందిర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ నగరం నిత్యం వార్తల్లో నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇప్పుడు రామాలయంలో రామయ్యకు ఇవ్వనున్న మొదటి హారతికి, మహాయజ్ఞానికి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యిను పంపుతూ మరోసారి జోధ్ పూర్ వాసులు రామ భక్తుల మదిలో చిరస్థాయిగా నిలుస్తున్నారు. రామయ్య కొలువుదీరనున్న ఆలయంలో దేశీ ఆవు నెయ్యితో తొలి అఖండ దీపం వెలిగిస్తారు. దీంతోపాటు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జరిగే మహాయజ్ఞంలో జోధ్‌పూర్ నుంచి తీసుకొచ్చిన నెయ్యి, హవన సామగ్రిని సమర్పించనున్నారు.
జోధ్‌పూర్‌కు చెందిన యువ సాధువు ఓం సాందీపని మహారాజ్ ఈ గొప్ప కార్యాన్ని చేపట్టారు. నెయ్యిని అయోధ్యకు తరలించేందుకు సన్నాహాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశీ నెయ్యిని 108 రథాలలో ఉంచి పౌరాణిక పద్ధతిలో అయోధ్యకు తీసుకెళ్లనున్నారు. ఈ రథాలను 216 ఎద్దులు తీసుకుని వెళ్లనున్నాయి. ఈ రథాల్లో నెయ్యితో పాటు యజ్ఞం హవనంలో సమర్పించే ఒప్పందాలు, హవన సామగ్రిని అయోధ్యకు తరలించనున్నారు. మొత్తం 6 క్వింటాళ్ల నెయ్యి , హవన సామగ్రితో అయోధ్యకు ఈ రథాలు చేరుకుంటాయని ఓం సాందీపని మహారాజ్ చెప్పారు.
విశిష్టమైన తీర్మానం..
గౌశాల నిర్వాహకుడు ఓం సాందీపని మహరాజ్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో రామభక్తుల కోరిక తీరేలా రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఒక నిర్ణయం వెలువరించాలనే ఆలోచన తన మనసులో వచ్చిందని చెప్పారు. ఆ రోజు తాను రామయ్యకు ఇచ్చే మొదటి మహా ఆరతికి , మహా యాగానికి నెయ్యి సేకరిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి నెయ్యిని సేకరించే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు.
నెయ్యి ఎలా భద్రపరచబడుతుందంటే..
2014లో 60 ఆవులతో ప్రారంభమైంది. ఇక్కడ గోశాల అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన ఆవులకు సేవ చేయాలనే లక్ష్యంతో మొదలైంది. తొలిదశలో ఈ 60 ఆవుల్లో కేవలం 5 ఆవులు మాత్రమే పాలు ఇచ్చేవి. కాలక్రమేణా ఆవుల సంఖ్య పెరిగి ప్రస్తుతం ఈ గోశాలో దాదాపు 360 ఆవులు ఉన్నాయి. గో సేవకుడు మహారాజ్ దేశీ నేయి గురించి మాట్లాడుతూ.. నెయ్యి కల్తీ చేస్తే త్వరగా పాడైపోతుంది. అయితే ఆవులకు స్వచ్ఛమైన పచ్చగడ్డి గడ్డి, ధాన్యాలను ఆహారంగా ఇస్తే.. ఆవు పాల నుంచి తీసే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంతే కాకుండా ఆవుల ముందు రోజూ హవనాన్ని నిర్వహిస్తారు. రోజంతా గోశాలలో ఆడియో మాధ్యమం ద్వారా గోవులకు శ్రీమద్ భగవత్ గీతను వినిపిస్తారు. ఈ ఆవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన వెన్న , నెయ్యిపై సానుకూల ప్రభావం ఉంటుంది. అంతేకాదు హరిద్వార్ నుండి ప్రత్యేక తీసుకుని వచ్చిన మూలికలను నెయ్యికి జోడించి నెయ్యిని నిల్వ చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ నెయ్యిని వేడి చేస్తారు. దీని వల్ల ఈ నెయ్యి చెడిపోదు.
గోవులకు ప్రతిరోజూ శ్రీమద్ భగవద్గీత
మహారాజ్ దేశీ నెయ్యి సిద్ధం చేశానని చెప్పారు. ఈ నెయ్యి తయారీ భారతదేశంలోని ఋషుల ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా జరిగింది. దీని వలన ఈ నెయ్యి త్వరగా పాడవదు. ఇందుకోసం ఆవుల ఆహారంలో కూడా మార్పులు చేశారు. గత 9 ఏళ్లుగా ఆవులకు పచ్చి మేత, ఎండు మేత, నీరు మాత్రమే ఇస్తున్నారు. బయట ఆహారాన్ని ఇవ్వలేదు. గోవులకు రోజూ భగవద్గీత వినిపించేవారు. ఇందుకోసం గోశాలలో 24 గంటలూ భగవద్గీత ప్లే చేసేవారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
60 గోవులతో గో శాల ప్రారంభం
భగవత్ గీతాన్ని వినడం ద్వారా గోమాతలను దేవుడు ఆశీర్వదిస్తాడని మహారాజ్ నమ్ముతారు. మనస్సు నిర్మలమవుతుంది. దేవుడిని తలచుకుంటూ ఆవులు పశుగ్రాసం తిని పాలు ఇవ్వాలి. దీని వల్ల అమృతం వంటి నెయ్యి సిద్ధిస్తుంది. 2014లో గోశాల ప్రారంభించిన సమయంలో రోడ్డు ప్రమాదాల బారిన పడిన గోవులే ఎక్కువ. వాటిలో మూడు-నాలుగు ఆవులే పాలు ఇచ్చాయి.
ఇప్పుడు గోశాలలో 350 ఆవులు
క్రమంగా గోశాలలో ఆవుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 350 ఆవులు ఉన్నాయి. కుటుంబంలా ఇక్కడ ఎవరికి వారే సేవలు అందిస్తారు.
ఈ యాత్రకు రూ.10 కోట్లు ఖర్చు
ఈ నెయ్యిని అయోధ్యకు తీసుకెళ్లేందుకు 108 రథాలకు 216 ఎద్దులను రెడీ చేశారు. రథాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 27 నుంచి ఈ ఘృత్ యాత్ర ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ యాత్ర దాదాపు 10 వేల గ్రామాల గుండా సాగుతుంది. ప్రతి గ్రామానికి వెళ్లే ముందు ఆ గ్రామానికి సమాచారం అందించబడుతుంది. ప్రతి ఇంటి నుంచి హవన సామగ్రిని సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఘృత్ యాత్రకు రూ.10 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..