Ayodhya: బాలరాముడి దివ్య దర్శనం కోసం అయోధ్యకు ఎప్పుడు వెళితే మేలు..?

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట... ప్రపంచ ఆధ్యాత్మిక ఘట్టం సంపూర్ణం.. విజయవంతం. ప్రముఖులంతా కనులారా చూసి తరించారు. ఆవిధంగా వీఐపీ కోటా ముగిసిపోయింది. అతిరథ మహారధులు సరే... ఆమ్‌ఆద్మీల సంగతేంటి? సామాన్యుల దర్శనం మాటేంటి? బాలరాముడి దివ్య దర్శనం కోసం అయోధ్యకు ఎప్పుడు వెళితే మేలు.. ఎలా వెళితే మేలు..?

Ayodhya: బాలరాముడి దివ్య దర్శనం కోసం అయోధ్యకు ఎప్పుడు వెళితే మేలు..?
Ayodhya Ram
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 22, 2024 | 6:13 PM

అయోధ్య జన్మస్థలిలో బాలావతారంలో కొలువు దీరాడు శ్రీరామచంద్రుడు. కమలాసనంపై నిలుచున్న ఆ దివ్య మంగళరూపం మీడియాలో కనబడగానే.. పులకించిపోయింది భక్తజనం. టెలివిజన్ స్క్రీన్స్‌పై సకల గుణాభిరాముడ్ని చూసి తరించిన సామాన్య భక్తులు.. నిజదర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇలా రామ్‌ లలా దర్శనభాగ్యం కోసం పరితపిస్తున్న సామాన్యులకు ప్రత్యేక స్లాట్‌లు కేటాయించింది తీర్థ క్షేత్ర ట్రస్టు. జనవరి 23… మంగళవారం నుంచి అయోధ్య రామాలయ తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయి. దర్శన వేళలు… ఉదయం ఏడునుంచి పదకొండున్నర వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి ఏడు గంటల వరకు. పైగా… రామాలయ ప్రవేశం కోసం ఎటువంటి ప్రత్యేక రుసుమూ లేదు.

మధ్యాహ్నం రెండున్నర గంటల పాటు స్వామివారి ఆరాధన, విశ్రాంతి కోసం ఆలయ తలుపులు మూసివేస్తారు. రోజుకు మూడుసార్లు స్వామివారికి హారతిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పాసులు తీసుకున్న 30 మందికి మాత్రమే అనుమతిస్తారు. 1992 డిసెంబర్‌లో అయోధ్యలో రామజన్మభూమి కోసం శ్రమించిన కరసేవకులకు దర్శనం విషయంలో తొలి ప్రాధాన్యం ఇవ్వబోతోంది ఆలయ ట్రస్ట్.

ఈనెల 24 నుంచి కరసేవకుల్ని స్పెషల్ ఇన్‌వైటీస్‌గా ఆహ్వానాలు పంపింది రామాలయ ట్రస్ట్. ఒక్కో జిల్లా నుంచి కనీసం 2 వేల మంది వస్తారని అంచనా. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే కరసేవకులతో అయోధ్యలో విపరీతమైన రద్దీ ఏర్పడే ఛాన్సుంది. వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే ఛాన్సుంది. ఈ గ్యాప్‌లో సామాన్య భక్తులకు ఇక్కట్లు తప్పవు. అందుకే.. మార్చి, ఏప్రిల్ నెలల తర్వాతే మిగతా భక్తులు అయోధ్య ప్రయాణం పెట్టుకోవడం మంచిదనేది ట్రస్ట్ ఇస్తున్న సలహా.

ఇవి కూడా చదవండి

2025 డిసెంబర్‌కల్లా రామాలయ నిర్మాణం సంపూర్ణం అవుతుంది కనుక ఆ తర్వాత అయోధ్యకు వస్తే బాలరాముడి దర్శనం మరింత దివ్యంగా ఉంటుంది. ప్రస్తుతానికి గుడి నిర్మాణ పనుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యారు నిర్వాహకులు. దర్శనానికొచ్చే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్ల మీద పూర్తిగా దృష్టి పెట్టలేదు. అందుకే.. అంచనాకు మించి భక్తులొస్తే, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి కనుక.. అయోధ్య ప్రధాన ద్వారం దగ్గరే నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఐనా.. అయోధ్యకు సామాన్య భక్తుల రాకపోకలు ఇకమీదట ఊహకందని రీతిలో పెరగబోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగునాట భక్తజనం అయోధ్య రాముడి దర్శనం కోసం తహతహలాడుతోంది. హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు వెళ్లాలంటే ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. ఇందులో ఒక్కటి మాత్రమే నేరుగా అయోధ్య జంక్షన్‌కు చేరుకుంటుంది. మిగతావి మన్కాపూర్. గోండా స్టేషన్ల మీదుగా వెళతాయి. అక్కడి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయోధ్య క్షేత్రం. భాగ్యనగరం నుంచి అయోధ్య వెళ్లాలంటే సరాసరి 30 గంటల ప్రయాణ సమయం.

కాశీ యాత్రకు వెళ్లేవాళ్లు.. వారణాసి నుంచి మరో నాలుగు గంటలు ప్రయాణిస్తే అయోధ్యకు చేరుకోవచ్చు. అటు.. ప్రధాన నగరాలనుంచి విమానాల రాకపోకల కోసం అయోధ్యలో అధునాతన ఎయిర్‌పోర్ట్‌ ఇటీవలే ప్రారంభమైంది. ట్రావెలింగ్ కంపెనీలు ఇప్పటికే అయోధ్య కేంద్రంగా ఆకర్షణీయమైన టూరిజమ్ ప్యాకేజీల్ని సిద్ధం చేస్తున్నాయి. కానీ.. ఇన్నేళ్లు ఓపిక పట్టిన భక్తులు.. మరో ఏడాదో, ఏడాదిన్నరో ఆగి వెళితే అయోధ్య బాలరాముడి దర్శన భాగ్యం సులభంగా జరిగే అవకాశముంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?