AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ram Lalla: అయోధ్యలో అల్లుడు రామయ్య గృహ ప్రవేశం.. అత్తారిల్లు జనక్‌పూర్‌ సంబరాలు..

నేపాల్ లోని శ్రీ రామ్ యూత్ కమిటీ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్ చౌదరి ANIతో మాట్లాడుతూ “త్రేతాయుగంలో వనవాసానికి వెళ్ళిన రామచంద్రుడు అతను అనుభవించిన బాధ.. కలియుగంలోనూ కొనసాగిందని అన్నారు. రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో తిరిగి రావడానికి ఐదు వందల ఏళ్లపాటు కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. టార్పాలిన్ కింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. రామయ్య పడిన బాధ హిందువులందరి బాధ. మందిర నిర్మాణం కోసం మన పూర్వీకులు పోరాడారు.. కష్టపడ్డారు.. ఆ పోరాటాలకు చివరకు అంతిమ ఫలితం దక్కింది.

Lord Ram Lalla: అయోధ్యలో అల్లుడు రామయ్య గృహ ప్రవేశం.. అత్తారిల్లు జనక్‌పూర్‌ సంబరాలు..
Nepal Janaki Devi Temple
Surya Kala
|

Updated on: Jan 22, 2024 | 11:19 AM

Share

అయోధ్యలోని తన జన్మ స్థలం బాల రాముడు కొలువుదీరనున్న వేళ మన దేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం సందడి నెలకొంది. అయోధ్య నగరంతో పాటు దేశ విదేశాల్లోని అనేక నగరాలు రామాలయాల ప్రాణ ప్రతిష్ట వేడుకలను జరుపుకుంటున్నాయి. మరోవైపు రామయ్యకు భారీ సంఖ్యలో భక్తులు కానుకలను అందిస్తున్నారు. రామయ్య అత్త్తరిల్లు అయిన నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి భారీగా సారెను ఇప్పటికే నేపాల్ వాసులు తీసుకుని వచ్చారు. నేడు తమ అల్లుడు గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో నేపాల్ లోని జానకి దేవాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సీతాదేవి ఆలయం విద్యుత్ దీపాలతో దేదీప్యంగా ప్రకాశిస్తుంది.

రామ్ లల్లా అత్తమామల నివాసం అయిన జనక్‌పూర్ లో సోమవారం దీపావళిని ఘనంగా నిర్వహించాడానికి సన్నాహాలు చేస్తన్నారు. ఇప్పటికే నగరంతో పాటు సీతాదేవి ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ లైట్లతో మిలమిలా మెరిసిపోతుంది. సంతోషాన్ని తెలియజేస్తూ నగరంలో రామ ప్రతిష్ట వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నేపాల్‌లోని జానకి ఆలయం

నేపాల్ లోని శ్రీ రామ్ యూత్ కమిటీ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్ చౌదరి ANIతో మాట్లాడుతూ “త్రేతాయుగంలో వనవాసానికి వెళ్ళిన రామచంద్రుడు అతను అనుభవించిన బాధ.. కలియుగంలోనూ కొనసాగిందని అన్నారు. రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో తిరిగి రావడానికి ఐదు వందల ఏళ్లపాటు కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. టార్పాలిన్ కింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. రామయ్య పడిన బాధ హిందువులందరి బాధ. మందిర నిర్మాణం కోసం మన పూర్వీకులు పోరాడారు.. కష్టపడ్డారు.. ఆ పోరాటాలకు చివరకు అంతిమ ఫలితం దక్కింది. దీంతో రాముని ఆలయ నిర్మాణం జరుపుకుంటుంది. నేడు ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా తను భారతీయ పౌరులందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. తమ అల్లుడు గృహప్రవేశం సందర్భంగా జనక్‌ పురి వాసులు కూడా ఆనందంలో ఉన్నారని చెప్పారు.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో సీతాదేవి పుట్టిల్లు తో పాటు నగరాన్ని ముస్తాబు చేశారు.

జానకి సేన (సైన్యం), యువజన సంఘం నాయకత్వంలో నూనె, మట్టి ప్రమిదలు, ఒత్తులను విరాళాలు సేకరించారు. రెండు లక్షల యాభై వేల నూనే దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీతా దేవి పుట్టిల్లు జనక్‌పూర్ లో కూడా ప్రాణ ప్రతిష్టా రోజున అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు సాయంత్రం వేడుకలను నిర్వహించాలని యోచిస్తున్నారు. రంగులతో పాటు పువ్వులను ఉపయోగించి ముగ్గులను వేశారు. ఈ రోజు సాయంత్రం దీపావళి జరుపుకోవడానికి ఇప్పటికే సేకరించిన 2500 లీటర్లకు పైగా నూనెతో సుమారు 2,50,000 దీపాలను వెలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులలో ఒకరైన అసుతోష్ ఝా ANIతో మాట్లాడుతూ, “జనక్‌పూర్ , మిథిలా నివాసితులు తమ సంకల్పం విజయవంతం అయ్యేలా అవసరమైన ఇతర వస్తువులతో పాటు నూనె, దీపాలు, మట్టి ర-ప్రమిదాలను అందిస్తున్నారు. అర్ధ రాత్రి అయినా తమ శక్తికి తగిన విధంగా నూనే వంటి వాటిని విరాళంగా అందిస్తున్నారు.

నేపాల్‌లోని జనక్‌పూర్ లోని చీఫ్ మహంత్‌తో పాటు చోటే మహంత్ వేడుకకు రామయ్య ప్రతిష్ట వేడుకలకు ఆహ్వానం పంపించారు. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. పూర్వం జనక్‌పూర్ ఆచారంలో భాగంగా స్థానికంగా భార్ అని పిలిచే సారేను ఆభరణాలు, వంటకాలు, బట్టలు, ఇతర నిత్యావసర వస్తువులతో సహా అనేక రకాలు అయోధ్యకు పంపారు.

మరిన్ని అయోధ్య రామాలయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..