AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామ మందిర విశేషాలివే! మిగిలిన రెండు విగ్రహాలను ఎక్కడ ఎలా ఉంచనున్నారంటే..

ఆలయంలో అన్నీ అద్భుతాలే అనిపించే విధంగా మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. బాల రాముడు మొదటి అంతస్తులో గర్భ గుడిలో కొలువు దీరి భక్తులను అనుగ్రహించనున్నాడు. అయితే ఆలయ  ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు.  

Ayodhya: అయోధ్య రామ మందిర విశేషాలివే! మిగిలిన రెండు విగ్రహాలను ఎక్కడ ఎలా ఉంచనున్నారంటే..
Ayodhya Ram Lalla
Surya Kala
|

Updated on: Jan 22, 2024 | 10:48 AM

Share

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామయ్య తన జన్మ భూమిలో కొలువుదీరుతున్న వేళ ఆసేతు హిమాచలం సంబరాలను జరుపుకుంటుంది. అయోధ్యలో అతి పెద్ద భవ్య రామమందిర నిర్మాణాన్ని జరుపుతున్నారు.  నిర్మాణంలో అన్నీ అద్భుతాలే అనిపించే విధంగా మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. బాల రాముడు మొదటి అంతస్తులో గర్భ గుడిలో కొలువు దీరి భక్తులను అనుగ్రహించనున్నాడు. అయితే ఆలయ  ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు.

161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్‌ 2) చేపడుతోన్న మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల బాల రాముడి విగ్రహం ఇప్పటికే ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. నేడు ప్రాణ ప్రతిష్ట జరగనుండగా..మిగతా రెండు విగ్రహాలను రెండు,  మూడు అంతస్తులోని ఆలయంలో ఉంచుతామని గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. ‘‘పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది. 25- 30 అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు. అందుకే పెద్ద మూర్తి అవసరమైంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఎంపిక కష్టమైంది !

‘‘మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. అవన్నీ అందంగా ఉన్నాయి. దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం, రాముడు ఆజానుబాహుడు కాబట్టి.. చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాలను పాటించామని పేర్కొన్నారు. మేం ఎంపిక చేసిన ప్రతిమ శరీర పుష్టి, మంచి వ్యక్తిత్వం కనబడేలా చక్కగా కుదిరింది. పిల్లవాడి సున్నిత స్వభావం దాని అందాన్ని పెంచింది. ఆభరణాలను సున్నితంగా చెక్కారు’’ అని ట్రస్టు కోశాధికారి వివరించారు. విగ్రహాలను చెక్కేందుకు నాలుగైదు నెలలు పట్టిందని, అనంతరం ఒకరోజు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని అయోధ్య రామాలయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..