Ram Lalla: కోట్లాది రామ భక్తుల కల తీరుతున్న వేళ.. పాల పిట్ట దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

హిందూ సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు, చెట్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరిపే సమయంలో జమ్మి వంటి చెట్లను పూజించడమే కాదు..అందమైన పాల పిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం. దసరా రోజున పాల పిట్ట దర్శనం అత్యంత ఫలవంతం అనే నమ్మకం అంది. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రామయ్య తన జన్మ భూమికి చేరుకుంటున్న శుభ తరుణంలో పాల పిట్ట దర్శనం చేసుకోవాలని భావించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగాలని భావించిన అనేక మంది భక్తులు రామాయణాన్ని అనుసరిస్తూ పాల పిట్టను చూడడానికి జూ పార్క్ చెంతకు చేరుకున్నారు.

Ram Lalla: కోట్లాది రామ భక్తుల కల తీరుతున్న వేళ.. పాల పిట్ట దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
Neelkanth Bird
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2024 | 10:10 AM

అంతా రామమయం.. జగమంతా రామ మాయం.. ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిర నమూనాలే , ఎక్కడ విన్నా రామ నామ స్మరణే..  ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నా శుభ సమయం ఆసన్నం అవుతున్న వేళ దేశమంతా సంబరాలు జరుపుకుంటున్నారు. నేడు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుపుకోనున్న సందర్భంగా దేశమంతా  ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రామయ్య తన భార్య సీత దేవిని రావణాసురుడి చెర నుంచి విడిపించడానికి యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని.. అనంతరం లంకను జయించాడని విశ్వాసం. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రామయ్య తన జన్మ భూమికి చేరుకుంటున్న శుభ తరుణంలో పాల పిట్ట దర్శనం చేసుకోవాలని భావించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగాలని భావించిన అనేక మంది భక్తులు రామాయణాన్ని అనుసరిస్తూ పాల పిట్టను చూడడానికి జూ పార్క్ చెంతకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

పాలపిట్ట దర్శనం కోసం పరుగులు

దేశ రాజధాని డిల్లీ, ఆగ్రాలో పాల పిట్టను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో రామ భక్తులు చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం వద్దకు చేరుకున్నారు. ఈ పాల పిట్టను చూసి రాముడు రావణుడి లంకను జయించాడని నమ్ముతారు. అందుకనే అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురష్కరించుకుని పాల పిట్ట దర్శనం కోసం పోటెత్తారు. ఈ నేపధ్యంలో పర్యావరణవేత్త, వన్యప్రాణుల ప్రేమికుడు దేవాశిష్ భట్టాచార్య మాట్లాడుతూ చంబల్‌లో పాల పిట్టల పక్షుల సంఖ్య గతం కంటే సుమారు 4 శాతం పెరిగిందన్నారు.

హిందూ సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు, చెట్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరిపే సమయంలో జమ్మి వంటి చెట్లను పూజించడమే కాదు..అందమైన పాల పిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం. దసరా రోజున పాల పిట్ట దర్శనం అత్యంత ఫలవంతం అనే నమ్మకం అంది. రావణాసురడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరి వెళ్లే సమయంలో దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించడానికి ఇదొక కారణమని సామాజిక కార్యకర్త విజయ్ ఉపాధ్యాయ్ కూడా జోడించారు.

ఇవి కూడా చదవండి

పాల పిట్టను శివుని స్వరూపంగా భావిస్తారు.

రావణుడిని చంపినందుకు, శ్రీరాముడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. పాప నివృత్తి కోసం రాముడు శివునికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు పాల పిట్ట రూపంలో రాముడికి దర్శనం ఇచ్చాడని ఓ పురాణ కథనం. అందుకే పాల పిట్టను శివుని స్వరూపంగా కూడా పరిగణిస్తారని హిందుస్థానీ బిరాదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ వివరించారు.

అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట వేళ శుభం జరగాలంటూ రామ భక్తులు భారీగా పాల పిట్ట దర్శనం కోసం అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఉష్ణమండల ప్రాంతాలలో సమృద్ధిగా కనిపించే నీలకంఠ పక్షులు చంబల్ తో పాటు దాని చుట్టు పక్కల పరిసర ప్రాంతాలలో భారీ సంఖ్యలో కనిపిస్తాయి. వాటి జనాభా రోజు రోజుకీ పెరుగుతోంది. పాల పిట్టను నీలకంఠం పక్షి అని కూడా అంటారు. నీలం రంగు గొంతు కలది అని అర్ధం.

మరిన్ని అయోధ్య రామాలయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!