Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..

Bhadrachalam Laddu: భద్రాద్రి రామాలయంలో 400 లడ్డూలు మాయం..ఎస్‌..రాములోరి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయాల్సిన లడ్డూలు కాజేశారు. రోజువారీ తనిఖీల్లో...

Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..
Bhadrachalam Temple
Follow us

|

Updated on: Sep 30, 2021 | 9:13 AM

Bhadrachalam Laddu: భద్రాద్రి రామాలయంలో 400 లడ్డూలు మాయం..ఎస్‌..రాములోరి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయాల్సిన లడ్డూలు కాజేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా అధికారులు సోదాలు చేయడంతో ఇంటిదొంగల వ్యవహారం బయటపడింది.400 లడ్డూలు మాయం అయినట్లు గుర్తించారు. తాత్కాలిక ఉద్యోగి ఈ లడ్డూలను మాయం చేసినట్లు గుర్తించిన ఆలయ అధికారులు..అతని నుంచి 8వేల నగదును రికవరీ చేశారు.

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో లడ్డూల విక్రయాల్లో అవకతవకులు నిత్యకృత్యంగా మారింది. ఇలా లడ్డూలు మాయం కాడం తరచూ జరుగుతూనే ఉంది. దశాబ్ధాలుగా ఇలా జరుగుతున్నా అధికారులు పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టలేక పోతున్నారు. ఈ లడ్డూల చోరీకి ఆంతర్యం ఏమిటన్న విమవర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాల్లో లడ్డూ ప్రసాద విక్రయాలు, ఆర్జిత సేవల్లో కంప్యూటర్‌ ఆధారిత టికెట్ల జారీ విధానం అమలవుతోంది.

భద్రాద్రి దేవస్థానంలోనూ గతంలో కొంతకాలం ఈ విధానం అమలైనా తరువాత ఈ విధానానికి స్వస్తి పలికారు. దీంతో అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని దేవస్థానం ఉద్యోగులే అంటుండం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భద్రాద్రి రామాలయంలో తరచూ వందలు, వేల సంఖ్యలో లడ్డూలు మాయం కావడం.. లడ్డూల లెక్కల్లో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.

తాత్కాలికంగా తప్పులను సరిదిద్దిమే అని తప్పించి శాశ్వత దిద్దుబాటుపై చర్యలపై ఆలయ అధికారలు పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో మళ్లీ అదే తప్పులను తిరిగి చేయడం దేవస్థానంలో రివాజుగా మారిపోయింది.

గతంలో ఆర్జిత సేవ టికెట్లు రీసైక్లింగ్‌ సంఘటనలు చాలా జరిగినట్లుగా సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రాములవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతోంది భద్రాద్రి ఆలయం.. ఈ మూడురోజుల్లో.. రెండోసారి వివాదంలో నిలింది భద్రాద్రి ఆలయ దేవస్థాన వ్యవహారం. మొన్నటికి మొన్న అన్నదాన సత్రంలో వర్థంతి భోజనాలు పెట్టి ఆగ్రహానికి గురైంది ఆలయ కమిటీ. ఇప్పుడు ఇంటి దొంగలను పట్టుకోవడంలోనూ విఫలమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు లడ్డూలను మాయం చేసిన ఇంటి దొంగలు..

ఇవి కూడా చదవండి: IPL srh vs csk Match Prediction: చెన్నైతో సై అంటే సై.. విజయోత్సాహంతో దూకుడుమీదున్న హైదరాబాద్

Skin Care: మీ ముఖం మీద అవాంఛిత పుట్టుమచ్చలు ఉన్నాయా.. వాటిని తొలిగించుకునేందుకు ఇంట్లోనే ఇలా చేయండి..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు