AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grah Gochar 2023: 20 సంవత్సరాల తరువాత శుభ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత మరొక గ్రహ స్థానంలో మారడం వలన అనేక రకాల యోగాలు ఏర్పడుతాయి. ఈ యోగం శుభం, అశుభం రెండూ కావచ్చు. అయితే, 20 సంవత్సరాల తర్వాత 4 రాజయోగాల కలయిక జరగబోతోంది. ఈ రాజయోగాలు నీచభంగ్, షష్, బుధాదిత్య, హన్స్ రాజయోగ్. జ్యోతిషశాస్త్రం ప్రకారం..

Grah Gochar 2023: 20 సంవత్సరాల తరువాత శుభ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
Zodiac Signs
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2023 | 6:54 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత మరొక గ్రహ స్థానంలో మారడం వలన అనేక రకాల యోగాలు ఏర్పడుతాయి. ఈ యోగం శుభం, అశుభం రెండూ కావచ్చు. అయితే, 20 సంవత్సరాల తర్వాత 4 రాజయోగాల కలయిక జరగబోతోంది. ఈ రాజయోగాలు నీచభంగ్, షష్, బుధాదిత్య, హన్స్ రాజయోగ్. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ నాలుగు రాజయోగాలు అన్ని రాశిచక్ర గుర్తుల వారి జీవితాలపై శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. అయితే, ముఖ్యంగా 3 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి సంపద, జీవితంలో పురోగతి పొందే అవకాశం ఉంది.

ఈ రాశుల వారి భవితవ్యం మారుతుంది..

కుంభ రాశి..

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుంభ రాశి వారికి 4 రాజయోగాల సృష్టి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారికి డబ్బు లభిస్తుంది. ఈ రాశిలోని లగ్న గృహంలో షష్ రాజయోగం ఏర్పడుతున్నదని, ధన గృహంలో నీచభంగ్ రాజయోగం ఏర్పడుతున్నదని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగా దాని ప్రభావం వ్యక్తి ఆర్థిక జీవితంపై చాలా శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం కూడా మంచిగా, బలంగా మారుతుంది.

మేషరాశి..

20 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ రాజయోగాలు మేష రాశి వారికి కూడా మేలు చేయబోతున్నాయి. వాటి నిర్మాణం మేష రాశిలోని రెండవ ఇంట్లో జరగబోతోందని పండితులు చెబుతున్నారు. ఐశ్వర్యం ఇస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది.కొత్త ఆదాయ వనరులకు అవకాశం వస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తికి మంచి ఆఫర్లు వస్తాయి.

మకరరాశి..

ఈ రాశి వారికి ఈ రాజయోగం చాలా శుభప్రదం కానుంది. ఈ రాశికి చెందిన వ్యక్తి జాతకంలో గజకేసరి, బుధాదిత్య, నీచభంగ్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ కాలంలో, వ్యక్తి ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. భాగస్వామి కోసం చూస్తున్న వ్యక్తులకు ప్రయోజనం ఉంటుంది. సోదరులు, సోదరీమణుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులు పురోభివృద్ధి పొందుతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..