Astro Tips for Money: ఎంత కష్టపడినా సక్సెస్ దక్కడం లేదా.. రోజూ ఈ సులభమైన పరిష్కారాలు చేసి చూడండి..

|

Jun 05, 2023 | 11:41 AM

సమస్యలను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రం తో పాటు,  జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సులభమైన నివారణ చర్యలున్నాయి.  ఇవి మీ సమస్యలను పరిష్కరిస్తుందని విశ్వాసం. ఈ రోజు సమస్యలకు సులభమైన, ఖచ్చితంగా పరిష్కారాల గురించి తెలుసుకుందాం.. 

Astro Tips for Money: ఎంత కష్టపడినా సక్సెస్ దక్కడం లేదా.. రోజూ ఈ సులభమైన పరిష్కారాలు చేసి చూడండి..
Astro Tips For Money
Follow us on

కొందరు ఎంత కష్టపడినా తగిన ఫలితం అందుకోలేరు. చిన్నచిన్న సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యలకు పరిష్కారం కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాంటి సమస్యలను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రం తో పాటు, జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సులభమైన నివారణ చర్యలున్నాయి.  ఇవి మీ సమస్యలను పరిష్కరిస్తుందని విశ్వాసం. ఈ రోజు సమస్యలకు సులభమైన, ఖచ్చితంగా పరిష్కారాల గురించి తెలుసుకుందాం..

  1. మంత్రం: శివుని అభిషేకం. చిన్న మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, ప్రతిరోజూ శివలింగాన్ని నీటితో అభిషేకించండి. దీంతో కోరికలు నెరవేరి కష్టాలు తొలగిపోతాయి.
  2. నుదుటిపై బొట్టు: మీరు ఇంటి నుండి బయట వెళ్లే సమయంలో ముందుగా కొద్దిగా బెల్లం తినండి. ఇలా తీపి తినడం వలన చేపట్టిన పనిలో సక్సెస్ అందుకుంటారు. అంతే కాదు సంతోషం, శాంతి, ఐశ్వర్యం, కీర్తి కోసం, ప్రతి గురువారం వెండి పాత్రలోని కుంకుమని నుదుటిపై దిద్దుకోండి.
  3. బాలికకు దానం: బుధవారం గుడి బయట కూర్చున్న ఎవరైనా బాలికకు బాదంపప్పుని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన వ్యాధులు నయం అవుతాయి.
  4. ఎరుపు పువ్వులతో అర్ఘ్యం: ఉద్యోగంలో బదిలీకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. రాగి పాత్రలో నీరు నింపి ఎరుపు పువ్వులతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా 21 రోజులు చేస్తే సమస్య పోతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏకాక్షి కొబ్బరికాయ: దక్షిణావర్తి శంఖాన్ని మీ ఇంట్లో ఉంచండి. దీంతో పేదరికం తొలగిపోతుంది. దీనితో పాటు ఏకాక్షి కొబ్బరికాయను పూజించండి. దీనివల్ల ఇంట్లో సుఖం, శాంతి, లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం. అంతేకాదు ఏకాక్షి కొబ్బరికాయ ఉన్న ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
  7. క్రిస్టల్ బాల్ ప్రయోజనాలు: వాస్తు శాస్త్రం ప్రకారం క్రిస్టల్ బాల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో లేదా ఆఫీసులో క్రిస్టల్ బాల్ ఉంచడం అదృష్టం తెస్తుంది. అంతే కాదు కుటుంబ కలహాలు దూరమై వ్యాపారంలో లాభాలు పొందుతారని విశ్వాసం.
  8. ఈశాన్యంలో నీరు: వాస్తు ప్రకారం ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఇంటి ఈశాన్య మూలలో ఒక గ్లాసు నీటిని నింపి ఉంచడం శ్రేయస్కరం. దీంతో ఇంట్లో సానుకూలత కూడా పెరుగుతుంది.
  9. ఈ దిశలో ఎటువంటి వస్తువులను ఉంచవద్దు: వాస్తు శాస్త్రంలో తూర్పు దిశ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సూర్యోదయ దిశ. భవనాన్ని నిర్మించేటప్పుడు ఈ దిశను చాలా ఖాళీగా ఉంచాలి. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నివసించేవారు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు.  ఆందోళన కలిగి ఉంటారు.
  10. ఈ దిశను ఖాళీగా ఉంచవద్దు: యముడు దక్షిణ దిశకు అధిపతి. ఈ దిశ వాస్తు శాస్త్రంలో ఆనందం, శ్రేయస్సు కు చిహ్నం. ఖాళీగా ఉంచవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).