Astro Bath Tips: స్నానం చేయడానికి కొన్ని నియమాలు.. మధ్యాహ్నం స్నానం చేస్తున్నారా.. రోగాలు పెరుగుతాయని తెలుసా..!

|

Aug 05, 2023 | 8:04 AM

శాస్త్రాలలో మధ్యాహ్నం స్నానం చేయడం చాలా అశుభం అని చెప్పబడింది. 10 గంటల నుంచి 12 గంటల మధ్య స్నానం చేయడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని చెప్పారు. 10 నుండి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రీత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ప్రీత్ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి. శరీరంలో రక్తం కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం స్నానం చేయడం తప్పని సరి అయితే, ఆరోగ్యంగా ఉండటానికి, మీరు స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

Astro Bath Tips: స్నానం చేయడానికి కొన్ని నియమాలు.. మధ్యాహ్నం స్నానం చేస్తున్నారా.. రోగాలు పెరుగుతాయని తెలుసా..!
Astro Bath Tips
Follow us on

హిందూ మతంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది.  పండగలు, పర్వదినాల సమయంలో నది స్నానం చేస్తారు. ఇలా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయన్న నమ్మకం. మరోవైపు రోజూ నదీ స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేస్తారు. హిందూ మతం,  గ్రంధాలలో ప్రతిరోజూ స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. స్నానం చేయడానికి ఉన్న ఈ నియమాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాడు. అన్నింటికంటే స్నానం చేయడానికి ఏది సరైనది.. ఏది తప్పు అనే ప్రశ్న కొందరిలో ఉంది. అయితే కొందరు నిద్ర లేచిన వెంటనే ఉదయం స్నానం చేస్తే.. మరికొందరు బద్దకించి మధ్యాహ్నం స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వలన కలిగే లాభ నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

స్నానం చేయడానికి సరైన సమయం ఏదంటే? 

బ్రహ్మ ముహూర్తం స్నానం చేయడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం చాలా శుభదాయకమని, ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారికి శివ, హరి ముహూర్తమే సరైన సమయం. కానీ మధ్యాహ్నం పూట స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అయితే సాయంత్రం పూట స్నానం చేయాలనే నియమం గ్రంధాలలో పేర్కొనబడింది.

ఇవి కూడా చదవండి

స్నానం చేయడానికి మూడు శుభ ముహూర్తాలు

బ్రహ్మ ముహూర్తం – 3.30 నుండి 5.30 వరకు

శివ ముహూర్తం – ఉదయం 6 నుండి 8 వరకు

హరి ముహూర్తం – ఉదయం 8 నుండి 10 వరకు

మధ్యాహ్నం స్నానం చేయడం ఎందుకు అశుభమంటే 

శాస్త్రాలలో మధ్యాహ్నం స్నానం చేయడం చాలా అశుభం అని చెప్పబడింది. 10 గంటల నుంచి 12 గంటల  మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని చెప్పారు. 10 నుండి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రీత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ప్రీత్ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి. శరీరంలో రక్తం కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం స్నానం చేయడం తప్పని సరి అయితే, ఆరోగ్యంగా ఉండటానికి, మీరు స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

సాయంత్రం స్నానం చేయడానికి సరైన సమయం ఏది

ఉదయం స్నానం చేయలేకపోతే సాయంత్రం స్నానం చేయవచ్చు.. అయితే ఇందుకోసం సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య సమయాన్ని ఎంచుకోవాలి. దీనితో పాటు, స్నానం చేసిన తర్వాత సాయంత్రం హారతి చేయాలి.

ఇవి స్నానం చేయడం వల్ల కలిగే  ప్రయోజనాలు

బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల జీవితంలో జ్ఞానం, సహనం, ఆనందం, శాంతి, ఆరోగ్యం లభిస్తాయి, అయితే శివ, హరి ముహూర్తాలలో స్నానం చేయడం వల్ల ఆనందం, శాంతితో పాటు సంపద,  శ్రేయస్సు, విజయాలు లభిస్తాయి. దీనితో పాటు, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)