హిందువులు పూజించే దేవి దేవతలలో హనుమంతుడికి మాత్రమే అష్ట సిద్ధి యోగాలున్నాయి. ఆయన్ని నవ నిధి దాతగా పిలువబడుతున్నాడు. అంటే హనుమంతుడు మొత్తం అష్ట సిద్ధి, నవ నిధిని పొందాడు. ప్రాచీన కాలం నుండి హిందూ మతంలో సిద్ధిలకు, దైవిక జ్ఞానానికి విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. సిద్ధి అనే పదానికి పరిపూర్ణతను సాధించడం అని అర్థం. అయితే హనుమంతుడు ఈ అష్ట సిద్ధులను వరంగా ఎవరి నుండి పొందాడో తెలుసా?
హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి జీవితంలో భయం ఉండదని.. బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విషయం గోస్వామి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా అనే ద్విపదలో చెప్పబడిన సిద్ధులు చాలా అద్భుత శక్తులు.ఈ ఎనిమిది సిద్ధులు హనుమాన్ జీకి వరంలా ఇవ్వబడ్డాయి.
శ్రీ రాముడి భక్తుడైన హనుమంతుడు .. జానకి దేవి చే అష్ఠసిద్ధి నవ నిధులను వరంగా పొందాడు. ఈ సిద్ధులను నిర్వహించగల శక్తి హనుమంతుడికి మాత్రమే ఉందని చెబుతారు. ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు. ఈ తొమ్మిది సంపదలు పొందిన తర్వాత ఎలాంటి ధనం, ఆస్తి అవసరం ఉండదని విశ్వాసం. హనుమంతునికి ఎనిమిది రకాల విజయాలు ఉన్నాయి. వారి ప్రభావంతో అతను ఏ వ్యక్తి రూపాన్ని పొందగలడు. శరీరం చాలా చిన్నదిగా చేయగలడు అదే సమయంలో శరీరం కొండలా చాలా భారీగా పెంచనుగలడు. తన బుద్ధి బలంతో క్షణాల్లో ఎక్కడికైనా చేరుకోగలడు. వీటిని అష్ట సిద్ధులు అని అంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు