Ashada Masam 2023: ఆషాఢ మాసంలో ఈ 5 పనులు చేస్తే మీ జీవితం అంతా సంతోషమయమే..!

|

Jun 12, 2023 | 12:27 PM

హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేక ఉంది. ఆషాఢ మాసం శివుడు, విష్ణువుల ఆరాధనకు కీలకమైన మాసంగా వేద పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పుణ్య ఫలం, మోక్ష ప్రాప్తి కోసం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాల్సిన చర్యలు..

Ashada Masam 2023: ఆషాఢ మాసంలో ఈ 5 పనులు చేస్తే మీ జీవితం అంతా సంతోషమయమే..!
Ashadam
Follow us on

హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేక ఉంది. ఆషాఢ మాసం శివుడు, విష్ణువుల ఆరాధనకు కీలకమైన మాసంగా వేద పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పుణ్య ఫలం, మోక్ష ప్రాప్తి కోసం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సి పద్ధతుల గురించి వేదపండితులు కీలక సూచనలు చేశారు. జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే వివరాలు తెలుసుకుందాం..

1. ఆషాఢ మాసం జూన్ 19 నుంచి ప్రారంభమై జులై 17 ముగుస్తుంది. ఈ మాసంలో పూజలు, పారాయణం, ఉపవాసం, దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

2. హిందూ మతంలో ఆషాఢ మాసం శివుడు, విష్ణువుల ఆరాధనకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

3. ఆషాఢ మాసంలో ఉప్పుడు, ఉసిరి, ఖదౌన్, గొడుగు మొదలైనవి పేదలకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని బట్టి దేనినైనా దానం చేస్తే శుభం కలుగుతుంది.

4. ఆషాఢ మాసం పూజలకు, ఉపవాసాలకు ఎంతో శ్రేష్ఠమైనది. ఈ మాసంలో నుండి చాతుర్మాస్, ఆషాడ గుప్త నవరాత్రులు, యోగిని ఏకాదశి, దేవశయని ఏకాదశి, గురు పూర్ణిమ వంటి అనేక ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఈ నెల కొత్తగా ఉపవాసం ప్రారంభించడానికి కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

5. ఆషాఢమాసంలో ఇంట్లో తప్పనిసరిగా యాగం లేదా హవనం చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఏడాది పొడవునా అన్ని మాసాలలోకంటే ఆషాఢ మాసంలో యాగం చేస్తే సత్వర ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

6. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో పితృ దేవతల నామస్మరణ తప్పక చేయాలి. ఇది మీకు అదృష్టాన్ని కలుగజేస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

7. ఆషాఢ మాసం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ నెల మొత్తం సాయంత్రం ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంపదలు వస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు మత గ్రంధాలు, మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..