Rama Mandir: పొదుపు మొత్తం ఖర్చు చేసి రామయ్య ఆలయానికి తాళం రెడీ చేసిన భక్తుడు.. 400 కిలోల తాళం, 4 అడుగుల కీ

|

Aug 07, 2023 | 10:30 AM

ఈ తాళం గురించి చెప్పాలంటే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అలీఘర్‌లో జరిగిన వార్షిక ప్రదర్శనలో కూడా ఈ తాళం ప్రదర్శించబడింది. ఇప్పుడు శర్మ ఈ తాళంలో చిన్న మార్పు చేసి ఆపై అలంకరించే విషయంలో నిమగ్నమై ఉన్నారు. తాళంలో ఏ లోపం ఉండకూడదని శర్మ కోరుకుంటున్నారు.

Rama Mandir: పొదుపు మొత్తం ఖర్చు చేసి రామయ్య ఆలయానికి తాళం రెడీ చేసిన భక్తుడు.. 400 కిలోల తాళం, 4 అడుగుల కీ
400 Kg Lock For Ram Mandir
Follow us on

రామయ్య జన్మ భూమి అయోధ్యలో రాములోరు త్వరలో కొలువుదీరనున్నాడు. రామాలయం శరవేగంగా రెడీ అవుతుంది. మరోవైపు ప్రారంభదినోత్సవ తేదీని ఖరారు చేసి.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న రామమందిరానికి అలీఘర్‌కు చెందిన ఓ కళాకారుడు 400 కిలోల తాళాన్ని తయారు చేశాడు. ఈ తాళాన్ని తయారు చేసిన కళాకారుడి పేరు సత్య ప్రకాష్ శర్మ. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, కీ అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ తాళాన్ని రామాలయ నిర్వాహకులకు బహుమతిగా ఇవ్వాలని శర్మ యోచిస్తున్నారు.

ఈ తాళం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ 400 కిలోల తాళం ఎక్కడ ఉపయోగించాలని అనే విషయం చూడాలని చెప్పారు. శర్మ పూర్వీకులు ఒక శతాబ్దానికి పైగా తాళాలను  తయారు చేస్తున్నారు. తాళాలు తయారు చేసి.. పాలిష్ చేసే పనిని శర్మ 45 ఏళ్లకు పైగా చేస్తున్నాడు. రామ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు అడుగుల తాళపు చెవితో తెరుచుకునే ఈ తాళాన్ని తయారు చేసినట్లు శర్మ తెలిపారు.

ఈ తాళం ప్రత్యేకత ఏమిటి

ఈ తాళం గురించి చెప్పాలంటే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అలీఘర్‌లో జరిగిన వార్షిక ప్రదర్శనలో కూడా ఈ తాళం ప్రదర్శించబడింది. ఇప్పుడు శర్మ ఈ తాళంలో చిన్న మార్పు చేసి ఆపై అలంకరించే విషయంలో నిమగ్నమై ఉన్నారు. తాళంలో ఏ లోపం ఉండకూడదని శర్మ కోరుకుంటున్నారు. ఈ తాళం తయారు చేసే సమయంలో  సత్య ప్రకాష్ శర్మ భార్య రుక్మిణి దేవి పూర్తి సహకారం అందించారు.

ఇవి కూడా చదవండి

తాళం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే..

సత్య ప్రకాష్ శర్మ భార్య మాట్లాడుతూ ఇంతకు ముందు ఆరు అడుగుల పొడవు, మూడడుగుల వెడల్పుతో తాళం తయారు చేశామని.. అయితే కొందరు పెద్ద తాళం తయారు చేయమని సూచించారని పేర్కొంది. ఆ తర్వాత భారీ తాళం తయారీకి సంబంధించిన పని మొదలుపెట్టాం. ఈ తాళం తయారీకి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చయిందని శర్మ తెలిపారు. అలీఘర్ తాళాలకు పేరుగాంచిన నగరం. ఇంత రాకూ ఎవరూ తయారు చేయనటువంటి భారీ తాళాన్ని తయారు చేసి రామమందిరానికి భారీ తాళం వేయాలని అనుకున్నామని పేర్కొన్నారు దంపతులు. ఈ తాళం తయారీ కోసం వీరు దాచుకున్న జీవిత పొదుపు మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..