Vastu Tips: తరచుగా అనారోగ్యం పాలవుతున్నారా.. వీటిని మీ బెడ్ కింద ఉంచండి!

| Edited By: Ravi Kiran

Oct 24, 2023 | 6:00 PM

సాధారణంగా అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. వాతావరణం మారినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్, ఇన్ ఫెక్షన్స్ వంటివి చుట్టుబుడతాయి. నార్మల్ గా ఉంటే ట్యాబ్లెట్స్ తో సరిపెట్టేస్తాం. కానీ తీవ్రంగా ఉంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కొందరు జబ్బు పడుతూంటారు. ముఖ్యంగా సరైన నిద్ర ఉంటేనే చాలా సమస్యలకు, వ్యాధులకు బైబై చెప్పవచ్చు. ఎందుకంటే సరైన..

Vastu Tips: తరచుగా అనారోగ్యం పాలవుతున్నారా.. వీటిని మీ బెడ్ కింద ఉంచండి!
Sick
Follow us on

సాధారణంగా అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. వాతావరణం మారినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్, ఇన్ ఫెక్షన్స్ వంటివి చుట్టుబుడతాయి. నార్మల్ గా ఉంటే ట్యాబ్లెట్స్ తో సరిపెట్టేస్తాం. కానీ తీవ్రంగా ఉంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కొందరు జబ్బు పడుతూంటారు. ముఖ్యంగా సరైన నిద్ర ఉంటేనే చాలా సమస్యలకు, వ్యాధులకు బైబై చెప్పవచ్చు. ఎందుకంటే సరైన విధంగా నిద్రపోతే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాం. కానీ అలా కాకుండా.. పదే పదే మీరు అనారోగ్యం పాలవుతుంటే మాత్రం దానికి ఇంట్లోని వాస్తు దోషాలు కూడా కారణం అయి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని టిప్స్ ని పాటించడం వల్ల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సువాసన గల పూలను దిండు కింద ఉంచండి:

మీకు నిద్ర సరిగ్గా పట్టాలంటే.. పడుకునే ముందు కొన్ని సువాసన గల పూలను మీ దిండు కింద ఉంచండి. ఇలా చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇవి కూడా చదవండి

నాణాన్ని పెట్టుకోవచ్చు:

వాస్తు దోషాలు పోవాలన్నా.. మంచి నిద్ర పట్టాలన్నా పడుకునేటప్పుడు దిండు కింద నాణెం పెట్టుకోవడం చాలా మంచిది. ఈ నాణాన్ని తూర్పు దిశలో ఉంచాలి.

పచ్చి యాలకులు:

కొన్ని పచ్చి యాలకులను దిండు కింద పెట్టడం వల్ల మంచి సువాసనతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కత్తి:

మీకు భయంకరమైన పీడ కలలు వస్తూ ఉంటే మాత్రం.. దిండు కింద ఇనుముతో తయారు చేసిన కత్తిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెడు కలలను నియంత్రిస్తుంది.

మంచం కింద చెంబును ఉంచండిం

పూర్వం నిద్రించేటప్పుడు తల దగ్గర నీటితో నింపిన చెంబును ఉంచేవారు. ఇలా నీటితో నింపిన చెంబును ఉంచడం వల్ల శుభ ప్రదంగా భావించే వారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

సోంపు:

మీరు పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రించాలంటే తల దిండు కింద కొద్దిగా సోంపును ఉంచండి. ఇలా చేయడం వల్ల రాహు దోషం కూడా పోతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గి.. బాగా నిద్ర పడుతుంది.