Aradhana Mahotsav: ఘనంగా జరుగుతున్న రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాలు.. ఆ రాయరు అనుగ్రహం కోసం పూజలు

|

Aug 23, 2021 | 5:13 PM

Aradhana Mahotsav: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠం లో రాఘవేంద్ర స్వామి 350 వ ఆరాధన మహోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 27 వరకు జరుగుతాయని శ్రీ మఠం పీఠాధిపతి..

Aradhana Mahotsav: ఘనంగా జరుగుతున్న రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాలు.. ఆ రాయరు అనుగ్రహం కోసం పూజలు
Raghavnedra Swami
Follow us on

Aradhana Mahotsav: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠం లో రాఘవేంద్ర స్వామి 350 వ ఆరాధన మహోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 27 వరకు జరుగుతాయని శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి చెప్పారు. అవును “నమ్మిన నా మది మంత్రాలయమేగా… ఓఓ, నమ్మని వారికి తాపత్రయమేగా… శ్రీగురు బోధలు అమృతమయమేగా… ఓఓ, చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత”…. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే “మంత్రాలయం”. మంత్రాలయం అసలు పేరు “మాంచాలే”.

కర్నూల్ జిల్లలో తుంగభద్రా నది తీరన కొలువైన మహిమన్మితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం మంత్రాలయం. రమణీయమైన,అద్బుతమైన దివ్య క్షేత్రం. కాంచి పట్టణానికి 26 మైళ్ళ దూరం లో గల భువనగిరి లో క్రి శ 1598 లో వెంకట బట్టు అనే బాలుడు జన్మించాడు. ఆయనే పెరిగి పెద్దవాడు అయి శ్రీ రాఘవేంద్ర స్వామిగా ప్రసిద్ది చెందాడు. రాఘవేంద్ర స్వామి పాల్గుణ మాసం లోవచ్చే శుద్ధ సప్తమి తిథి నాడు జన్మించాడు. ఆ రోజుని స్వామి వారి జయంతిగా విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

“శ్రావణ బహుళ ద్వితీయ” నాడు క్రీ.శ. 1671 లో అయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సమాధి పొందారు. ఆ సమాధినే రాఘవేంద్ర బృందావనం అని పిలుస్తారు. ఆ బృందావనం నాటి నుండి నేటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నది. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం. తనను నమ్మి తన దగ్గరికి వచ్చిన వారి కోరికలు, ఆపదలు తప్పకుండ తీర్చు మహిమన్మితమైన స్వామి. స్వామి బృందావనంతరం కూడా ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. మూడు రోజుల పాటు జరిగే ఈ ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా, దేదిప్యామనాంగా జరుగుతాయి.

మహా తపాస్సంపన్నుడు జమదగ్ని మహర్షి, ఆయన బార్య రేణుకాదేవి మంచాల దేవతగా ఇక్కడ అవతరించింది అని ఆమె పేరు మీదే గ్రామానికి మంచాల అని స్థిరపడిందని. అనంతరం అది మంత్రాలయ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది అని స్థల పురాణం.
బృందావనం వెలసిన చోటే పూర్వం భక్త ప్రహ్లదుడు యజ్ఞం చేసాడని. అతడే కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని.. విజయనగర సామ్రాజ్యధినేత శ్రీ కృష్ణ దేవరాల మత గురువైన శ్రీ వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని చెబుతుంటారు. తనను దర్శించిన భక్తుల కోరికలు తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలగచేస్తారు రాఘవేంద్ర స్వామి. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు.

తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) అధికారులు ఆగష్టు 24 న మధ్యారాధన సందర్భంగా ఆరాధనలో భాగంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి శ్రీ రాఘవేంద్ర స్వామికి శేష వస్త్రం సమర్పించనున్నారు.

Also Read: Asaduddin Owaisi: డ్రోన్ల వాడకం పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లగించడమే.. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఒవైసీ