AP Temples: తలనీలాలు సమర్పించే భక్తులకు ఏపీ ప్రభుత్వం షాక్.. టికెట్ ధర భారీగా పెంపు .. క్షురకులు కోసమే అంటూ..

|

Mar 17, 2023 | 8:38 AM

తలనీలాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని క్షురకులకే  పంచనున్నామని హరి జవహర్‌లాల్‌ తెలిపారు. ఏపీలో 610 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలను నియమించనున్నామని ప్రకటించారు. ఈ పాలకవర్గ సభ్యుల్లో ఒకరికి నాయి బ్రాహ్మణులకు స్థానం ఉంటుందని ప్రకటించారు.

AP Temples: తలనీలాలు సమర్పించే భక్తులకు ఏపీ ప్రభుత్వం షాక్.. టికెట్ ధర భారీగా పెంపు .. క్షురకులు కోసమే అంటూ..
Hair Offering Temples
Follow us on

హిందూ సనాతన సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ టికెట్ ధర రూ. 40కి పెంచింది. ఇక నుంచి ఆలయాల్లో తలనీలాలను తీసే విధులను నిర్వహించే క్షురకులు కమిషన్ గా రూ. 20 లు ఇవ్వాలని దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.

కమిషన్ ఎలా ఇవ్వనున్నారంటే:

వాస్తవానికి ప్రస్తుతం తలనీలాల సమర్పణకు టికెట్ ధర రూ. 25 లు ఉంది. ఈ మొత్తం క్షురకులకే ఇస్తున్నారు. ఇక నుంచి వీరందరికీ కమిషన్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తలనీలాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని క్షురకులకే  పంచనున్నామని హరి జవహర్‌లాల్‌ తెలిపారు. అయితే ఆలయాల్లో తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.20 వేలకంటే తక్కువుగా ఉంటే.. అప్పుడు తలనీలాలను అమ్మడంతో వచ్చే ఆదాయంనుంచి డబ్బులను తీసుకుని మొత్తం ఒకొక్కరికి రూ.20 వేల రూపాయలను చెల్లించనున్నారు. అప్పుడు కూడా క్షురకులకు చెల్లించడానికి ఆదాయం సరిపోకపోతే.. అప్పుడు దేవాలయంలోని ఆదాయంలో 3 శాతం వినియోగించే వీలుని కల్పించారు దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌.

ఇవి కూడా చదవండి

ఎవరు అర్హులంటే:

అయితే దీనికి కూడా కండిషన్స్ అప్లై అని చెప్పారు. ఈ కమిషన్ 2022 జనవరి 1వ తేదీ నాటికీ పనిచేస్తున్న క్షురకులు అదీ ఆలయంలో 100 రోజుల పనిచేస్తేనే రూ.20 వేలు కమిషన్ అందించనున్నామని తెలిపారు.

ఏపీలో ఎంతమంది అర్హులంటే:

ఏపీలోని చిన్న పెద్ద ఆలయాల్లో అంటే దేవాదాయ శాఖకిందకు వచ్చే ఆలయాల్లో 1100 మంది క్షురకులు విధులు నిర్వహిస్తున్నారని కేశఖండనశాల కార్మికుల అధ్యక్షుడు గుంటిపల్లి రామదాసు తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వనున్న కమిషన్ ఈ అర్హులకు అందనుందని తెలుస్తోంది.

మంత్రి కొట్టు సత్యనారాయణ

దేవాలయాల పాలక వర్గ సభ్యుల్లో నాయి బ్రాహ్మణులకు ఒకరిని సభ్యలుగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఇదే విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన గౌరవం అని అన్నారు. ఏపీలో మొత్తం 1,234 ఆలయాలు ఉండగావీటిల్లో 610 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలను నియమించనున్నామని ప్రకటించారు. ఈ పాలకవర్గ సభ్యుల్లో ఒకరికి నాయి బ్రాహ్మణులకు స్థానం ఉంటుందని ప్రకటించారు. దీంతో నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..