ఏడాది పొడవునా అమర్‌నాథ్ యాత్ర కోసం హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సుదీర్ఘ ప్రయాణం.. ప్రయాణంలో కష్టాలను ఎదుర్కొంటూ ఏదో ఒకవిధంగా బాబా బర్ఫానీ దర్శనం చేసుకుని జన్మ ధన్యం అయిందని భావిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర ఇప్పటికే ప్రారంభమై వారం రోజులు గడిచింది. అయితే శివయ్య భక్తులను నిరాశపరిచే వార్త ఒకటి వినిపిస్తోంది. మంచు శివలింగం బాబా బర్ఫానీ అదృశ్యమయ్యారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైంది. జూలై 6న అమర్‌నాథ్ గుహలోని మంచు లింగ కరిగిపోయిందని వార్తలు వచ్చాయి. యాత్ర ప్రారంభమైన 10 రోజులలోపే బాబా బర్ఫానీ అదృశ్యం కావడానికి ఎండల వేడి, ఉష్ణోగ్రతలు కారణం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుందాం.
అమర్‌నాథ్ గుహలో ఉన్న శివలింగం సహజంగా మంచుతో ఏర్పడుతుంది. ఈ గుహ లోపల ఉండే నీరు గడ్డకడుతూ శివలింగం ఆకారం సంతరించుకుంటుంది. ఇలా ఏర్పడిన శివలింగం పరిమాణం చంద్ర కళల ప్రకారం పెరుగుతుంది. వర్షపాతం తగ్గినప్పుడు ఏ ప్రాంతంలోనైనా వేడి పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది విపరీతమైన ఎండలతో ఉత్తర, మధ్య భారతదేశాలు మే నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇటీవల కాశ్మీర్ లోయలో గరిష్ట ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 7.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో అమర్‌నాథ్ గుహ పూజారులు కూడా బాబా బర్ఫానీ వేడి కారణంగా ఈసారి త్వరగా కరిగిపోయారని పేర్కొన్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కశ్మీర్ లోయ ప్రజలు కూడా తీవ్ర వేడి, తేమతో సతమతమవుతున్నారు. ఇది బాబా బర్ఫానీపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపింది. అయితే ఇలా జరగడానికి గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే కారణం కాదు. అమర్‌నాథ్ గుహ చుట్టూ పెరుగుతున్న మానవ, యాంత్రిక కార్యకలాపాలు కూడా దీనికి చాలా కారణమని చెబుతున్నారు.
Latest footage of Baba Barfani reveals a significant melting of the ice Shivling compared to previous visuals.
Additionally, over 1.20 lakh devotees visited Baba Barfani during the initial six days of the #Amarnath_Yatra pic.twitter.com/TaWe0aQfhf
— Sanjiv K Pundir (@k_pundir) July 5, 2024
అమర్నాథ్ తీర్థయాత్ర పూర్తి కాకముందే బర్ఫ్ బాబా అంతరించిపోవడం ఇదే మొదటిసారి కాదని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2006లో యాత్ర ప్రారంభం కాకముందే బాబా రూపం కరిగిపోయింది. 2004లో యాత్ర ప్రారంభించిన 15 రోజులకే హిమ లింగం అంతరించిపోయింది. 2013లో హిమలింగం 22 రోజుల్లో కరిగిపోగా 2016లో 13 రోజుల్లో కరిగిపోయింది.
2006లో ప్రయాణం ప్రారంభించక ముందే బాబా బర్ఫానీ అంతరించిపోయారు. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డుతో సంబంధం ఉన్న రిటైర్డ్ అధికారిని ఒక నివేదికలో.. పుణ్యక్షేత్రం బోర్డు దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిందని వెల్లడించారు. బోర్డు అభ్యర్థన మేరకు, ఆర్మీకి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ , స్నో అండ్ అవలాంచె స్టడీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బాబా బర్ఫానీపై ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. అమర్ నాథ్ గుహ చుట్టూ ఉష్ణోగ్రతలు పెరగడమే శివలింగం కరిగిపోవడానికి ప్రధాన కారణమని తేలింది. అంతేకాదు గుహలో పెరిగిన భక్తుల సంఖ్య, గుహ చుట్టూ పెరుగుతున్న మానవ కార్యకలాపాలు కూడా దీనికి కారణం.
ఒక్కో భక్తుడు గుహలో సుమారు 100 వాట్ల శక్తిని వెదజల్లుతున్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో అమర్‌నాథ్ యాత్ర సమయంలో దాదాపు 250 మంది భక్తులు ఒకేసారి పవిత్ర గుహలో ఉంటారు. అమర్‌నాథ్ గుహలో వెంటిలేషన్ లోడ్ దాదాపు 36 కిలోవాట్‌లుగా ఉంది. అంటే ఎక్కువ మంది భక్తులు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో గుహలో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది బాబా బర్ఫానీని నేరుగా ప్రభావితం చేస్తుంది.
హిమ లింగం అంతరించిపోయారని వార్తలు వచ్చినప్పుడల్లా నిపుణులు దానిని ఆపేందుకు కొన్ని సూచనలు ఇస్తుంటారు. బాబా బర్ఫానీ దర్శనానికి వెళ్లేవారి సంఖ్యను పరిమితం చేయాలని ఇంతకు ముందు కూడా ఒక పరిష్కారంగా సూచించామని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఆనంద్ శర్మ చెప్పారు. అయితే.. ప్రజల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సూచన ఎంతమేరకు సమర్థవంతంగా అమలు చేయగలం అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు గుహ చుట్టూ యంత్రాలు మొదలైన వాటి వినియోగంపై కూడా నిషేధం విధించాలి. దీనివల్ల కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
ఈ మార్పుకు నిజమైన కారణం గ్లోబల్ వార్మింగ్, దీనితో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. దీంతో మెట్ట ప్రాంతాల్లోనూ ఈసారి వేడి పెరిగింది. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి, ప్రపంచం మొత్తం ప్రకృతి రక్షణ కోసం చర్యలు చేపట్టాలి. పెరుగుతున్న కాంక్రీట్ భవనాలను, యంత్రాల వాడకాన్ని ఆపాలి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ మనిషి ఎటువంటి గుణపాఠం నేర్చుకునేందుకు సిద్ధంగా లేడు. అటువంటి పరిస్థితిలో ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని.. అయితే ఈసారి లోయలో అలా కూడా జరగలేదని వాతావరణ నిపుణుడు డాక్టర్ ఆనంద్ శర్మ తెలిపారు. ఓ వైపు వర్షం తగ్గుముఖం పట్టడంతో మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా బాబాను దర్శించుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీంతో శరీర ఉష్ణోగ్రత కూడా ప్రభావితమవుతుంది. గుర్రాలు, మ్యూల్స్‌తో పాటు, హెలికాప్టర్ విమానాలు వినియోగం కూడా నిరంతరం పెరుగుతోంది. భక్తుల కోసం అందించే ఆహారం, ఇతర సేవలు, బలగాలు వలన పవిత్ర గుహ, తీర్థయాత్ర మార్గంలో భద్రత కోసం మోహరించిన సామగ్రి వలన కూడా ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది.
ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రలో బాబా బర్ఫానీ దర్శనం పట్ల శివయ్య భక్తుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. గత ఏడాది అంటే 2023లో దాదాపు నాలుగున్నర లక్షల మంది అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేసి బాబా దర్శనం చేసుకోగా.. ఈ ఏడాది ఆరు లక్షల మంది పవిత్ర యాత్ర చేపడతారని అంచనా.. కేవలం వారం రోజుల్లోనే 1.5 లక్షల మందికి పైగా భక్తులు బాబా దర్శనం చేసుకున్నారు. అంటే..ఇప్పుడు వాతావరణం.. హిమ లింగం తన ఉనికి చూపితే.. అమర్నాథ్ యాత్ర చేసే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..