Amarnath Yatra 2022: అమరనాథ్ యాత్రలో శివుడు ఇష్టమైన వస్తువులను త్యాగం చేసిన ప్రదేశాలు.. ప్రధాన విరామ ప్రాంతాలు

|

Jul 02, 2022 | 8:24 AM

హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవి కి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఐతే పార్వతి దేవికి మనిషి జీవితం గురించి చెప్పడానికి.. శివుడు తనకు ఇష్టమైన వస్తువులన్నింటినీ మార్గమధ్యలో విడిచిపెట్టాడట.

Amarnath Yatra 2022: అమరనాథ్ యాత్రలో శివుడు ఇష్టమైన వస్తువులను త్యాగం చేసిన ప్రదేశాలు.. ప్రధాన విరామ  ప్రాంతాలు
Amarnath Yatra 2022
Follow us on

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగనుంది.  మంచు రూపంలో దర్శనం ఇచ్చే శివయ్యను చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్తుంటారు.  జలరూపంలో ఉన్న శివుడిని దర్శించుకోవడానికి భక్తులుఅత్యంత శ్రమ కోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ ధామ్ చరిత్ర శతాబ్దాల నాటిది. అమర్‌నాథ్ ధామ్‌లోని గుహలో కూర్చుని శివుడు పార్వతి తల్లికి అమరత్వం రహస్యాన్ని చెప్పాడని హిందూపురాణాల కథనం. ఈ గుహ దగ్గరే మనిషి జీవితం గురించి  చెప్పడానికి.. శివుడు తనకు ఇష్టమైన వస్తువులన్నింటినీ విడిచిపెట్టాడట. అనంతరం శివుడు పార్వతితో గుహలోకి ప్రవేశించాడు. పరమశివుడు ప్రియమైన వస్తువులను విడిచిపెట్టిన ప్రదేశాలు, నేడు ఆ ప్రదేశాలు అమర్‌నాథ్ యాత్ర ప్రధాన విరామాలు. ఈరోజు ఆ నాలుగు దశల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పహల్గం:
శివుడు ఏకాంత ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు..  మొదట నందిని ఒక ప్రదేశంలో విడిచిపెట్టాడని చెబుతారు. నేడు ఆ ప్రదేశం పహల్గంగా ప్రసిద్ధి చెందింది. పహల్గాం అనేది అమర్‌నాథ్ పవిత్ర గుహకు వార్షిక యాత్ర ప్రారంభ స్థానం. ఈ ప్రదేశం నుండి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది.

చందన్ వారి
శివుడు మరి కొంత దూరం వెళ్లిన తర్వాత చంద్రుని తల నుంచి వేరు చేశాడు. ఈ ప్రదేశాన్ని చందన్ వారి అంటారు. ఈ ప్రదేశంలోని ఆణువణువూ పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో శివుడు తన శరీరంలోనివిభూతి, గంధాన్ని తొలగించాడని నమ్ముతారు. ఇక్కడి మట్టిని ప్రజలు తలపై పవిత్రంగా ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

శేష్ నాగ్ సరస్సు
ఈ ప్రదేశంలో శివుడు తన మెడలోని పామును తొలగించాడని చెబుతారు. అందువల్ల ఈ ప్రదేశం శేషనాగ్‌కు అంకితం చేయబడింది. ఇక్కడ ఒక సరస్సు ఉంది. ఇందులో శేష్ నాగ్ నివాసం ఉంటాడని భావిస్తున్నారు. ఈ సరస్సును చూసేవారికి మిగిలిన సర్పాలు తమ పడగను విప్పి ఇక్కడ కూర్చున్నట్లు అనిపిస్తుంది.

మహాగుణ పర్వతం
శేషనాగ్ సరస్సు తరువాత మహాగుణ పర్వతం వస్తుంది. శివుడు తన కొడుకు వినాయకుడిని కూర్చోబెట్టుకుని వెళ్ళిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని గణేష్ టాప్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చాలా అందంగా, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని మహాగణేష్ పర్వతం అని కూడా అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..