Simhachalam Temple: సింహాద్రి అప్పన్న తిరుకల్యాణోత్సవం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం

Simhachalam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక తిరుకల్యాణోత్సవ౦ మంగళవారం(నేడు) జరిగను౦ది.

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న తిరుకల్యాణోత్సవం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం
Simhadri Appanna
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:39 AM

Simhachalam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక తిరుకల్యాణోత్సవ౦ మంగళవారం(నేడు) జరిగను౦ది. కల్యాణోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా సింహగిరి క్షేత్రం ముస్తాబయి౦ది. విద్యుత్ కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతో౦ది. సోమవారం సాయంత్రం మృత్సంగ్రహణం, ధ్వజారోహణం అంకురార్పణంతో కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు అర్చక స్వాములు.17వ తేదీ రాత్రి జరిగే పుష్పయాగం, ఊంజలసేవతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఈ నేపథ్యంలో సింహగిరి పుణ్యక్షేత్రం విద్యుత్ కాంతుల వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. గాలి గోపురం మొదలుకొని ఆలయ ప్రాకారాలు, పరిసరాలు అందంగా ముస్తాబయ్యాయి.

ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన రథోత్సవం మంగళవారం రాత్రి 8.30 గంటలకు, కల్యాణోత్సవం రాత్రి 10.30 గంటలకు పాంచరాత్రాగమశాస్త్ర విధానంలో జరగనున్నాయి. కల్యాణోత్సవాన్ని ఈ ఏడాది సింహగిరిపై వున్న నృసింహవనం మధ్యలోని ఖాళీ స్థలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు.మంగళవారం స్వామివారి కల్యాణం కారణంగా మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించరు. రాత్రి పది గంటల తర్వాత దర్శన౦ చేసుకోవచ్చు. ఈ నెల 13,14,15,16 తేదీల్లో వైదిక కార్యక్రమాల కారణంగా రాత్రి ఏడు గంటల తరువాత స్వామివారి దర్శనం భక్తులకు లభించదు.

17వ తేదీన వినోద ఉత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు తర్వాత పుష్పయాగం ఉన్నందున సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కల్యాణ మహోత్సవం కారణంగా 17వ తేదీ వరకు స్వామివారి సుప్రభాతసేవ, ఉదయం,సాయంత్రం ఆరాధన సేవాటిక్కెట్లు, నిత్యకల్యాణోత్సవం, గరుడ సేవలను రద్దు చేసారు.సోమవారం KGF సినీ హీరో యాష్ తో పాటు చిత్ర యూనిట్ స్వామి వారిని దర్శించుకున్నారు. వచ్చేనెల 3వ తేదీన స్వామివారి చందనోత్సవం జరుగనుంది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..