అజ ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన ఉపవాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణు ఆగ్రహంతో పుణ్యం లభిస్తుందని.. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. అజ ఏకాదశి రోజున విధివిధానాల ప్రకారం శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ద్వారా కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే అజ ఏకాదశి రోజున కొన్ని నియమ నిబంధాలు ఉన్నాయి. అంతేకాదు అజ ఏకాదశి రోజున ప్రజలు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ఆగస్టు 29, గురువారం మధ్యాహ్నం 1:19 నుండి ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అజ ఏకాదశి 29 ఆగస్టు 2024న మాత్రమే జరుపుకుంటారు.
ఈసారి ఏకాదశి రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. సిద్ధి యోగం ఉదయం నుంచి సాయంత్రం 6.18 వరకు. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4:39 నుండి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు పూజకు చాలా ఫలవంతంగా పరిగణించబడతాయి. ఉపవాసం రోజున ఉదయం నుంచి సాయంత్రం 4.39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం శుభాఫలితలను ఇస్తుంది.
అజ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అజ ఏకాదశి రోజున ఉపవాసం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే పండితులని సంప్రదించవచ్చు. వివిధ మత గ్రంథాలలో ఉపవాసం సమయం, పూజా పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు