Ayyappa Sangamam: ప్రపంచ పుణ్యక్షేత్రంగా శబరిమల.. సెప్టెంబర్ 20న అయ్యప్ప సంగమం 2025
కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. దేశవిదేశాలతోపాటు.. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయితే.. శబరిమలను ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20న పంపాలో అయ్యప్ప సంగమం పెద్ద ఎత్తున జరగనుంది..

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. దేశవిదేశాలతోపాటు.. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయితే.. శబరిమలను ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20న పంపాలో అగోల అయ్యప్ప సంగమం (Agola Ayyappa Sangamam) పెద్ద ఎత్తున జరగనుంది.. ఈ సంగమానికి అయ్యప్ప భక్తులందరూ హాజరుకావాలని ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక ప్రకటనచేసింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్లాటినం జూబ్లీ లో భాగంగా, శబరిమలని ప్రపంచవ్యాప్తంగా దైవిక, సాంప్రదాయ – స్థిరమైన తీర్థయాత్ర కేంద్రంగా ఉన్నతీకరించే లక్ష్యంతో గ్లోబల్ అయ్యప్ప సంగమం సెప్టెంబర్ 20న పంపా నది ఒడ్డున జరుగనుంది.
ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అయ్యప్ప భక్తులు శబరిమల ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక ఐక్యతను పంచుకోవడానికి ఈ సంగమం ఒక వేదిక కానుంది.. “తత్వమసి” అనే సార్వత్రిక సందేశాన్ని వ్యాప్తి చేయడం, శబరిమలని మత సామరస్యాన్ని పంచుకునే ప్రపంచ తీర్థయాత్ర కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు
అయ్యప్ప సంగమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పంపాలో 3,000 మందికి వసతి కల్పించగల జర్మన్ మోడల్ పండల్ ఏర్పాటు చేశారు. పతనంతిట్ట, పెరునాడ్, పంప, మరియు సీతాతోడ్ వంటి ప్రదేశాలలో స్వాగత కమిటీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా భక్తులకు వసతి సౌకర్యాలతోపాటు.. KSRTC రవాణా – దర్శన అవకాశాలను ఏర్పాటు చేశారు.
పంపా – సమీపంలోని ఆసుపత్రులలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కొండలపై పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పారిశుధ్యం – ఇతర ప్రాథమిక సేవల కోసం స్వచ్ఛంద సంస్థలు అందుబాటులో ఉంటాయి.
శబరిమల భవిష్యత్తు అభివృద్ధి..
ఈ సమావేశంలో భాగంగా శబరిమల సంబంధిత భవిష్యత్ అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా చర్చలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే రూ.1,300 కోట్ల అంచనాలతో ప్రాజెక్టులను సిద్ధం చేశారు. శబరిమల విమానాశ్రయం, రైల్వే లైన్ సహా ప్రధాన ప్రాజెక్టులను ఉన్నత ప్రమాణాలతో అమలు చేస్తారు.
తత్వమసిని సూచించే లోగో..
అయ్యప్ప స్వామి, మకర జ్యోతి, శబరిమల చిత్రాలను కలిగి ఉన్న ప్రత్యేక లోగోను సంగమం కోసం ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ లోగో “తత్వమసి” సందేశం ప్రపంచానికి సూచిస్తుంది.
భక్తులు – అధికారుల కోసం చర్చా వేదిక
ఈ సంగమం భక్తులు, దేవస్వం బోర్డు – ప్రభుత్వం మధ్య పారదర్శకమైన సంభాషణలు – సూచనలకు వేదికగా మారనుంది. శబరిమల తంత్రితో సహా ముఖ్య ప్రధాన కార్యాలయ ప్రతినిధులు హాజరయ్యే ఈ చర్చలలో భక్తులు తమ అభిప్రాయాలను కూడా పంచుకోగలరు.
శబరిమల దర్శనానికి కొత్త మార్గం..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాత్రికులకు ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణను కలిపిన శబరిమల దర్శనాన్ని పరిచయం చేయడం.. శబరిమల ను ప్రపంచ స్థాయిలో ఉన్నతీకరించడం గ్లోబల్ అయ్యప్ప సంగమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




