బ్రహ్మముహుర్తంలో నిద్రలేస్తే జరిగే అద్భుతాలు ఇవే!
పెద్దవారు చెబుతుంటారు బ్రహ్మముహుర్తంలో నిద్రలేవాలి. ఈ సమయంలో నిద్ర లేవడం చాలా మంచిది, దీని వలన జ్ఞానం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు. అయితే చాలా మందికి అసలు బ్రహ్మ ముహుర్తం అంటే ఏ సమయం, కరెక్ట్ టైమింగ్ తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
Updated on: Sep 10, 2025 | 1:21 PM

పెద్దవారు చెబుతుంటారు బ్రహ్మముహుర్తంలో నిద్రలేవాలి. ఈ సమయంలో నిద్ర లేవడం చాలా మంచిది, దీని వలన జ్ఞానం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు. అయితే చాలా మందికి అసలు బ్రహ్మ ముహుర్తం అంటే ఏ సమయం, కరెక్ట్ టైమింగ్ తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం.. తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు. ఈ సమయంలో వాతావరణం చాలా బాగుంటుంది. అందువలన ఈ సమయంలో యోగా లేదా ధ్యానం చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. అంతే కాకుండా, బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

బ్రహ్మముహుర్తంలో ఎలాంటి శబ్ధాలు వినిపించవు. చల్లటి గాలి, ప్రశాంతమై వాతావరణం ఉంటుంది. అందువలన ఎవరైతే ఈ సమయంలో నిద్ర లేచి ద్యానం చేస్తారో, వారికి ఏకాగ్రత పెరుగుతుందంట. అంతే కాకుండా ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తులు ఎక్కవగా ఉంటం వలన ఈ సమయంలో చేసే పూజకు మంచి ప్రతి ఫలం ఉంటుందంట.

ఆరోగ్య పరంగా కూడా ఈ సమయంలో నిద్రలేవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట. పెద్ద వారు చెప్పినట్లుగానే ఈ సమయంలో చదువుకోవడం వలన చదివిన ప్రతీది ఎక్కువగా గుర్తుంటుందంట. ఎందుకంటే? బ్రహ్మముహుర్తంలో మెదడు పనితీరు బాగుంటుంది. ఈ సమయంలో చదువుకోవడం వలన మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రాలు ఉత్తేజితమై, చదివింది గుర్తుంటుందంట.

ముఖ్యంగా ఈ సమయాన్ని దేవతల సమయం అంటారు. ఎందుకంటే, ఈ ముహుర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తారని, అందువలన ఈ సమయంలో ఏ పూజ చేసినా అది వారికి చెందుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మీరు దేవుళ్లతో కనెక్ట్ అవ్వవచ్చు, అద్భుతమైన మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ సమయంలో చేసే ఏ పని అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుందంట.



