
ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేస్తుందని నమ్మే వారు మనలో చాలా మందే ఉంటారు. వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే ఎంత ఖర్చుతో ఇంటిని నిర్మించామన్నదానికంటే ఎంత సరైన వాస్తుతో నిర్మించామన్నదానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకోసం ఎంతో మంది వాస్తు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటారు.
అయితే ఈ వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఉండే వస్తువులకు సైతం వర్తిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ముఖ్యమైన వాటిలో వంటగది ఒకటి. మనిషి బతకడానికి ముఖ్యమైన భోజనం తయారయ్యే గది విషయంలో జాగ్రతలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంట గదిని వాస్త ప్రకారంగా నిర్మించడం ఎంత ముఖ్యమో, వంట గదిలో పెట్టుకునే వస్తువుల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వంట గదిలో ఏ వస్తువులు ఉంటే మంచిది కాదు, ఎలాంటి ఫలితాలు వస్తాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
వంటగదిని అన్నపూర్ణేశ్వరి పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకే కిచెన్ రూమ్ నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెబుతారు. కొందరు ట్యాబ్లెట్లను వంట గదిలో ఉండే డబ్బాల్లో పెడుతుంటారు. మీకూ ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో ట్యాబ్లెట్స్‌ను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అన్నపూర్ణేశ్వరి దేవి ఆగ్రహానికి గురికాక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇక వంట గదిలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. వీలైనంత వరకు మెటల్ పాత్రలను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తే నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇక వంట గదిలో అద్దం పెట్టుకునే అలవాటు ఇటీవల బాగా పెరిగిపోయింది. మహిళలు తరచూ అద్దంలో చూసుకుంటూ వంట చేస్తుండడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చేసే వంటపై దృష్టి సారించలేకపోతారనే సైంటిఫిక్ కారణాన్ని సైతం చెబుతున్నారు. ఇక వంట గదిలో చెత్త బుట్టను ఏర్పాటు చేసుకోవడం సర్వ సాధారణమైన విషయం. అయితే కిచెన్‌లో ఇలా డస్ట్‌బిన్‌ను పెట్టుకునే అలవాటును వెంటనే మానేయాలని వాస్తుల నిపుణులు చెబుతున్నారు. వంటింటిలో చెత్తా చెదారం ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఇక వంటింట్లో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన పాత్రలను ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. విరిగిన పాత్రలు వంట గదిలో ఉంటే దురదృష్టాన్ని, పేదరికాన్ని తెచ్చి పెడతాయని చెబుతున్నారు. అలాగే ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని, వెంటనే విరిగిన సామాన్లను ఇంట్లో నుంచి తీసేయాలని సూచిస్తున్నారు. వంట గదిలో ఉంచకకూడని మరో వస్తువు చీపురు, ఎట్టి పరిస్థితుల్లో వంటింట్లో చిపురును ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో చీపురు పెడితే కుటుంబంలో అశాంతితో పాటు అనార్యోగాలు తప్పవని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..