Friendship Day: జీవితంలో ప్రతి ఒక్కరి స్నేహితులు తప్పకుండా ఉంటారు. ఒకరితో మరొకరికి ఉన్న అనుబంధం.. వారిని సంతోషంగా, ధీమాగా, ధైర్యంగా ఉండేలా చేస్తుంది. జీవితంలో నిజమైన స్నేహితుడు దొరికితే.. జీవితం మెరుగుపడుతుంది. సదరు వ్యక్తులు ఎప్పటికీ ఒంటరి కాలేడు. నిజమైన స్నేహితుడు కష్ట సుఖాల్లో ఎల్లవేళలా తోడు, నీడగా ఉంటారు. అలా కాకుండా, తప్పుడు వ్యక్తుల సహవాసం చేస్తే మాత్రం జీవితం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. జీవితం చిధ్రం అవడం ఖాయం. వేలాది మంది చెడు స్నేహితుల కంటే.. ఒక్క మంచి స్నేహితుడు జీవితంలోకి వస్తే చాలు. అయితే, స్నేహం, స్నేహితుడి గురించి కూడా ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంథంలో వివరించారు. భవిష్యత్‌లో మోసపోకుండా ఉండేందుు స్నేహ హస్తం చాచడానికి ముందు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో చాణక్యుడు చాలా క్లియర్‌గా వివరించారు. మరి అసలైన స్నేహితుడు ఎవరు? మోసం చేసేవారు ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారినే మనం స్నేహితులు అని అంటాం. కానీ, కష్ట సమయాల్లో కూడా అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థం కోసం స్నేహ హస్తం చాచాలని, ఆడంబరంగా చూపించే వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు సూచించారు. అలాంటి వారితో స్నేహం చేయడం కంటే.. మీ బాధను మీరే నియంత్రించుకోవడం, మిమ్మల్ని మీరే ఓదార్చుకోవడం ఉత్తమం.
చాణక్యుడి ప్రకారం.. తీయగా మాట్లాడేవారు చాలా డేంజర్. ఒక వ్యక్తి తప్పులు ఎత్తి చూపేవారు, ఆ తప్పులను సరిదిద్దేవారు నిజమైన స్నేహితులు. చెడు స్నేహితులు ఎప్పుడూ మీ మంచి కోరరు. మీరు చేసేదే కరెక్ట్ అని చెబుతుంటారు. ఎందుకంటే.. వారు ఇతరుల మంచి కోరుకోరు. ఇక మంచి స్నేహితులను ఉప్పుతో పోల్చారు చాణక్యుడు. ఎందుకంటే.. స్వీట్లలో పురుగులు ఉంటాయి తప్ప ఉప్పులో పురుగులు ఉండవు. ఇలాగే మంచి స్నేహితులలో కూడా చెడు లక్షణాలు ఉండవని చెబుతున్నారు ఆచార్య.
ఒకరితో స్నేహం చేసే ముందు కొన్ని విషయాలను తప్పక గుర్తించాలి. సదరు వ్యక్తి ప్రవర్తన, స్వభావం, ఆలోచనా విధానాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇతరుల గురించి వారికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. స్వలాభం కోసం ఇతరులకు హానీ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారా? లేక మంచిగా ఆలోచిస్తున్నారా? అనేది గమనించాలి. ఒకవేళ ఇతరుల గురించి చెడుగా చెప్తున్నట్లయితే.. అలాంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూనే.. వెనుకవైపు మరోలా ఉంటారు. మనిషి పుట్టుకతో వచ్చే గుణాలు.. గిట్టేంత వరకు ఉంటాయని అంటారు. అలాగే చెడ్డవారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చాణక్య పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..