AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ మూడు విషయాల్లో అస్సలు మొహమాటపడొద్దు.. కాదంటే కష్టాలు తప్పవు మరి..!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాసిన నీతిశాస్త్ర గ్రంథం ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశనం. నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన..

Chanakya Niti: ఈ మూడు విషయాల్లో అస్సలు మొహమాటపడొద్దు.. కాదంటే కష్టాలు తప్పవు మరి..!
Chankya Niti
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2022 | 7:56 PM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాసిన నీతిశాస్త్ర గ్రంథం ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశనం. నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాటి పరిష్కారాలు, ఆర్థిక క్రమశిక్షణ, జీవితంలో ఉండాల్సిన తీరు సహా అనేక అంశాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్య నీతిశాస్త్రంతో పాటు.. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం కూడా రచ్చించారు. వీటిలో ఎన్నో కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే, ఒక వ్యక్తి తన జీవితంలో మూడు విషయాల్లో ఎప్పుడూ మొహమాట పడకూడదని స్పష్టం చేశారు. ఆ విషయాల్లో మొహమాటపడినా, సిగ్గు పడినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మరి ఆ మూడు అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్ఞాన సముపార్జనలో.. వ్యక్తికి జ్ఞాన సముపార్జన అనేది చాలా ముఖ్యం. జ్ఞానం లేకపోతే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాణక్యుడు జ్ఞానం విషయంలో కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. గురువు నుంచి జ్ఞాన్నాన్ని స్వీకరించే విషయంలో ఏమాత్ర మొహమాటపడొద్దన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా గురువును అడిగి మీర నివృత్తి చేసుకోవాలన్నారు. గురువు నుంచి జ్ఞానం పొందేవారు.. జ్ఞానవంతులు అవుతారని, జీవితంలో ఎలాంటి సమస్య ఎదరైనా ఈజీగా ఎదుర్కోవచ్చని చెప్పారు.

రుణ స్వీకరణ.. రుణం తీసుకునే విషయంలోనూ మొహమాటపడొద్దని ఆచార్య చాణక్యుడు తెలిపారు. అత్యవసరం అయినప్పుడు డబ్బు అడిగే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదన్నారు. డబ్బుకు సంబంధించి పనులలో వెనుకాడితే.. ఇబ్బందులుపడాల్సి వస్తుందన్నారు. అవసరం ఉండి, ఎవరినైనా అప్పు అడిగే ముందు వెనుకాడకూడదన్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణ జీవితం.. ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి సాధారణ జీవితం గడిపేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మనిషి వ్యక్తిత్వం ధరించిన దుస్తులను బట్టి ఉండదని, ఎదుటి వారి కోసం ఆడంబరాలకు పోతే లేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే సాధారణ దుస్తులు ధరించే విషయంలో ఎప్పుడూ సిగ్గుపడొద్దని హితవుపలికారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..