Snake Dance: ఆలయంలో 6 అడుగుల నాగుపాము.. సుబ్రమణ్య విగ్రహంపై నాట్యమాడిన నాగేంద్రుడు..

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి లో స్వర్ణ దుర్గ ఆశ్రమం ఉంది. అక్కడ ఆశ్రమంలో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో జంట నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎటునుంచి వచ్చిందో తెలియదు గానీ సుమారు 6 అడుగుల పొడవున గల భారీ త్రాచు పాము ఆలయంలో ప్రవేశించింది. అనంతరం ఆలయంలో ఉన్న విగ్రహంపై పడగ విప్పి, భూసలు కొడుతూ నాట్యమాడటం ప్రారంభించింది.

Snake Dance: ఆలయంలో 6 అడుగుల నాగుపాము.. సుబ్రమణ్య విగ్రహంపై నాట్యమాడిన నాగేంద్రుడు..
Snake Hulchul In Temple

Edited By: Surya Kala

Updated on: Dec 25, 2023 | 9:05 AM

దిగు దిగు దిగు నాగ.. దిగరా సుందర నాగ.. అంటూ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ పాటలు పాడారు. దాంతో పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అది చూడడానికి చాలా చిన్న ఆలయమైనా అక్కడ జరిగిన ఆ వింతను చూడడానికి జనం పరుగులు పెట్టారు. ఇది నిజంగా దేవుడి మహిమే అంటూ దండాలు పెడుతూ.. హారతులు పట్టి.. పూజలు చేశారు. ఇంతకీ ఆ ఆలయంలో జరిగిన వింత సంఘటన ఏంటి అని అనుకుంటున్నారా.. ఓ త్రాచుపాము సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జంట నాగుల విగ్రహాలపై పడగెత్తి నాట్యమాడింది. భుసలు కొడుతూ ఊగిపోయింది. అది గమనించిన స్థానికులు ఆ పామును చూసేందుకు పోటీలు పడి మరి అక్కడికి వెళ్ళారు. ఆ నోట ఈ నోటా పాకి విషయం తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి లో స్వర్ణ దుర్గ ఆశ్రమం ఉంది. అక్కడ ఆశ్రమంలో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో జంట నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎటునుంచి వచ్చిందో తెలియదు గానీ సుమారు 6 అడుగుల పొడవున గల భారీ త్రాచు పాము ఆలయంలో ప్రవేశించింది. అనంతరం ఆలయంలో ఉన్న విగ్రహంపై పడగ విప్పి, భూసలు కొడుతూ నాట్యమాడటం ప్రారంభించింది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆ వింతను ఆసక్తిగా తిలకించారు. ఇది నిజంగా నాగేంద్రుని మహిమేనంటు, పూజలు చేయడం ప్రారంభించారు.

 

ఇవి కూడా చదవండి

 

ఉదయం 7 గంటల నుంచి ఏ మాత్రం ఎటువైపు కదలకుండా విగ్రహం పైనే త్రాచుపాము అలాగే ఉండిపోయింది. ఎంతమంది భక్తులు వచ్చి చూసినా సరే అక్కడ నుంచి ఏ మాత్రం కదల్లేదు సరి కదా ఎవరికీ హాని కూడా చేయలేదు. దాంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగేంద్ర స్వామి భక్తులను దీవించేందుకు ప్రత్యక్షమయ్యాడని స్థానికులు భావించారు. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పాలు, పూలు, పళ్ళు ఆ పాముకి నైవేద్యంగా సమర్పించారు.

ఇలా సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నాగుపాము బుసలు కొట్టి నాట్యం మాడటం చాలా ఆనందంగా ఉందని, సుబ్రహ్మణ్యస్వామే నాగేంద్ర స్వామి అవతారంలో తన భక్తులను ప్రత్యక్షంగా ఆశీర్వదించడానికి వచ్చారని నమ్ముతున్నారు. సుమారు 6 గంటలకు పైగా పాము విగ్రహంపై భక్తులకు దర్శనమిచ్చి, అనంతరం పై నుంచి కిందకు దిగి ఆలయంలో నుండి బయటకు వచ్చి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోయింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..