ఏకగ్రీవం ప్రజాసస్వామికం అయినప్పుడు వద్దనడానికి మీరెవరు..? ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీల ఏకగ్రీవాలు అప్పుడే ప్రకటించవద్దని కలెక్టర్లకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశించిన
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీల ఏకగ్రీవాలు అప్పుడే ప్రకటించవద్దని కలెక్టర్లకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశించిన విషయం తెలిసందే. అయితే ఇది అప్రజాస్వామికమంటూ నిమ్మగడ్డపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు.
ఏకగ్రీవాలు అడ్డుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడైనా నిబంధన ఉందా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. గ్రామస్తులు కలిసి నిర్ణయం తీసుకుంటే SECకి అభ్యంతరం ఏంటన్నారాయన. దేశంలో మిగతా పదవులన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంటే… పంచాయతీలకు వచ్చిన అభ్యంతరం ఏంటన్నారు.
ఓటు హక్కును ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధానం తెలయని ఒక అసమర్థమైన వ్యక్తి రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్‌గా ఉండటం దురదృష్టకరమన్నారు జోగి రమేష్. రోజూ జిల్లాలు తిరుగుతూ చట్టం, రాజ్యాంగం అని నీతి కబుర్లు చెప్పే నిమ్మగడ్డ ఒక విచిత్రమైన ఆర్డర్ ఇచ్చారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ప్రకటించవద్దని కలెక్టర్లను కోరారు. చిత్తూరు అంటే చంద్రబాబు జిల్లా.. గుంటూరు అంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లానా..? అందుకే మీరిద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారా అని జోగిరమేష్ ప్రశ్నించారు.
జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలను, హక్కులను కాలరాయడానికి మీకు ఏం అధికారం ఉంది. ఏకగ్రీవం ప్రజాసస్వామికం అయినప్పుడు వద్దనడానికి మీరెవరు అంటూ జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more:
ఓటు బ్యాంక్ లేకుంటే.. భయమెందుకు..? నోటా పార్టీ అనుకుంటే.. నోరు జారకండి.. ఆ మంత్రికి సోము చురకలు