ఓటు బ్యాంక్‌ లేకుంటే.. భయమెందుకు..? నోటా పార్టీ అనుకుంటే.. నోరు జారకండి.. ఆ మంత్రికి సోము చురకలు

ఓటు బ్యాంకు కామెంట్లపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్‌ ఇచ్చారు. ఓటు బ్యాంకు లేనప్పుడు మా పార్టీ గురించి..

ఓటు బ్యాంక్‌ లేకుంటే.. భయమెందుకు..? నోటా పార్టీ అనుకుంటే..  నోరు జారకండి.. ఆ మంత్రికి సోము చురకలు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 05, 2021 | 3:39 PM

ఓటు బ్యాంకు కామెంట్లపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్‌ ఇచ్చారు. ఓటు బ్యాంకు లేనప్పుడు మా పార్టీ గురించి మాట్లాడకూడదు కదా అని సోము ప్రశ్నించారు. నోటా పార్టీ అనుకుంటే.. నోరు జారకండి జాగ్రత్త గా ఉండండి అంటూ సోము వెల్లంపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు.

బీజేపీ ఓటు బ్యాంక్‌ ఎంత.. ఆపార్టీకి మద్దతిస్తున్న జనసేన సత్తా ఎంత అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోము.. నోటా పార్టీ లోనే మంత్రి వెలంపల్లి పోటీ చేసి..3 వేల ఓట్లతోనే ఓడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు. బిజెపి సకల జనుల పార్టీ.. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు సోము వీర్రాజు. దేవాలయ నిధులను వాడేసిన చంద్రబాబు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇక సిపిఐ ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని అన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఈనెల 14న ఢిల్లీ వెళ్ళి జాతీయ కమిటీని కలిసి విన్నవిస్తామని సోము వీర్రాజు చెప్పారు. జీవీఎల్‌, మాధవ్ ఉక్కు శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు ధరలపై ఆలోచించాలని కోరారు. దేశంలోని అన్ని ఫ్యాక్టరీ ల పైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకపోవడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.

పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మేం ప్రతిపాదించాం. దానికి రాష్ట్రాలు అంగీకరించలేదు. పెట్రోల్ పై విధించే సెస్ ‌ను రాష్ట్రాలు తగ్గించుకోవాలి. పక్కనున్న తెలంగాణా, మధ్య ప్రదేశ్ లో ప్రభుత్వాలు సెస్ ను తగ్గించాయి. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు ఆలోచించాలని సోము వీర్రాజు కోరారు.