ఆ గ్రామస్తులు అన్నంత పని చేశారు.. ఒక్కతాటిపై నిలబడ్డారు.. ఏకంగా ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి తెచ్చారు.. అసలేం జరిగింది..!

జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్తులను బతిమాలినా వినలేదు. ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకుండా ఒకే మాటపై నిలబడ్డారు. దీంతో ఎన్నికలు వాయిదా తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఆ గ్రామస్తులు అన్నంత పని చేశారు.. ఒక్కతాటిపై నిలబడ్డారు.. ఏకంగా ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి తెచ్చారు.. అసలేం జరిగింది..!
Follow us

|

Updated on: Feb 05, 2021 | 3:24 PM

Panchayat poll boycott in Pudur : హెచ్చరించినట్లు గాని అన్నంత పని చేశారు ఆ గ్రామస్తులు. ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకుండా ఒకే మాటపై నిలబడ్డారు.ప్రతి గ్రామానికి రోడ్డు వేసే వరకు ఎన్నికలు బాయికాట్ చేస్తామని అన్నట్లుగానే ఒక్క నామినేషన్ పడకుండా చేశారు. దీంతో ఎన్నికలు వాయిదా తప్పని పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్తులను బతిమాలినా వినలేదు. రోడ్డు వేసి రండి ఆ తర్వాతనే ఎన్నికలంటే వెనక్కి తిప్పి పంపించారు. రోడ్డు కోసం గ్రామస్తులు నిర్ణయం కర్నూలు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశం అయింది

ఆ ఊరికి వెళ్ళాలంటే రహదారి అంతా రాళ్లు, గుంతల మయం. అందుకే ఆ వూరికి బంధువులు రావాలన్నా ఆసక్తి చూపరు. చివరికి రోడ్డు బాగాలేదని ఎమ్మెల్యే కూడా ఆ ఊరికి వెళ్లలేదు. అనేకసార్లు ఆ వూరి జనం అధికారులకు, నేతలకు మొరపెట్టుకొని విసిగిపోయారు. ఊరి బాగుకు ఉపయోగపడని ఎన్నికలు మా కొద్దంటూ ఆ ఊరి జనం పంచాయతీ ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించి అమలు చేశారు. ఒక్కరు కూడా నామినేషన్ వేయకుండా ఒక్క మాటమీద వున్నారు.

ఏళ్లు గడుస్తున్న ఆగ్రామానికి దిక్కులేదు.. కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. గ్రామంలోకి వచ్చేందుకు రోడ్డు వసతి లేకపోయింది. రోడ్డు వేయాలని ఏళ్ల తరబడి ప్రజాపతినిధులను, అధికారులను అడిగి విసి వేసారిపోయారు.. దీంతో ఆగ్రహనికి గురైన గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేశారు. ఆ ఊరంతా ఒకే మాట మీద నిలబడ్డారు. ఊరి బాగు కోసం పంచాయతీ ఎన్నికలు వద్దనుకున్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. అయిన సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఎన్నికల బహిష్కరనే మార్గమనుకున్నారు.

కర్నూలు నగరానికి 20 కి.మీ దూరంలో.. కర్నూలు-గుంటూరు స్టేట్ హైవేకి 10 కి.మీ దూరంలో పూడూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరి జనాభా 2 వేలు, ఓటర్లు 913 మంది. ఈ ఊరు చేరుకోవాలంటే చుక్కలు కన్పిస్తాయి. రోడ్డు అత్యంత అధ్వాన్నంగా ఉంది. రోడ్డు బాగా లేదని ఆర్టీసి బస్సు, అంబులెన్స్ వంటి వాహనాలు కూడా రావడం మానేశాయి. గర్భిణీలు అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే ప్రసవం అయిపోయేంతలా గుంతుల, రాళ్లు తేలిపోయాయి. ఊరి జనానికి తప్పింది కాదు… ఈ రోడ్డులోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.

గతంలో ఈ రోడ్డు బాగానే ఉండేది. పూడూరు వద్ద ఇసుక రీచ్ గుర్తించడంతో భారీ వాహనాలు తిరిగి రోడ్డు రూపురేఖలు మారిపోయాయి. పదేళ్లకుపైగా రోడ్డు వేయాలని ఊరి జనం అడగని నాయకుడు లేడు.. వేడుకోని అధికారి లేడు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామంలోకి రాకుండా ఎడ్లబండ్లు, బైకులు, ముళ్లకంప అడ్డుపెట్టి అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్డు వేసిన తరువాతే జన్మభూమి కార్యక్రమం నిర్వహించుకోవాలని గ్రామస్తులు ఆంక్షలు పెట్టారు. అప్పటికి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత రూ. 5 కోట్లు మంజూరు చేసినా టెండర్ల నిర్వహణలో జాప్యం చేయడం, సకాలంలో పనులు చేపట్టకపోవడం, 2019 ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. 25 శాతం కంటే తక్కువ పనులు చేసిన వాటిని రద్దు చేసిన పనుల్లో ఇదీ ఒకటి.

ఇక కొత్త ప్రభుత్వం వచ్చాకనైనా.. రోడ్డు వేస్తారని రెండేళ్లుగా జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకకూడా అనేకసార్లు రోడ్డు వేయాలని గ్రామస్తులు అభ్యర్థించారు. అయినా స్పందన లేదు. రోడ్డు బాగా లేదని ఎమ్మెల్యే సుధాకర్ గ్రామానికి రావడమే మానేశారు. పూడూరుకు ఇళ్ల పట్టాలు మంజూరైతే రోడ్డు బాగాలేని కారణంగా ఊరికి రాలేనని, పక్కనే ఉన్న దేవమడ గ్రామానికి వచ్చి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఒక్క రోజు పూడూరుకు రావడానికి అంతగా ఇబ్బంది పడుతున్నారంటే ఏళ్ల తరబడి ఆ ఊరి జనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పూడూరు రోడ్డు బాగు చేయలేని ఎన్నికలు మాకెందుకు అంటూ ఆ ఊరి జనం ఏకమయ్యారు. పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఊరిలో ఏకంగా దండోరా వేయించారు. ఎన్నికల సమయంలో ప్రతినాయకుడు వచ్చి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తరువాత రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితి ఉన్నా 108 వాహనం రాలేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయంటున్నారు పూడూరు జనం. 2007 నుంచి ఆ వూరికి ఆర్టీసి బస్సు నిలిపివేశారు. నేతలు, అధికారుల తీరుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు పుడూరు వాసులు.

పుడూరు లో ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. పలు దఫాలుగా అధికారులు గ్రామానికి వెళ్లి స్థానికులతో చర్చించారు. జెడ్పీ సీఈఓ, డీపీవో కూడా గ్రామానికి వెళ్లి ఎన్నికలు బహిష్కరించవద్దని, రోడ్డు వేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో అధికారులు హామీ ఇచ్చి పట్టించుకోలేదని గ్రామస్థులు గుర్తు చేశారు. కలెక్టర్ వచ్చి చెప్పాలని పట్టుబట్టారు. నిన్న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. కొందరు యువకులు నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. పోటీ చేసినా ఒక్కరు కూడా ఓటు వేసేదిలేదని తేల్చి చెప్పారు. దీనితో ఎవరు నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. మొత్తమ్మీద పుడూరు గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి ఎన్నికలు బహిష్కరించారు. ఎన్నికల బహిష్కరణ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు జిల్లా అధికారులు. అయితే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక వాయిదా పడే అవకాశముందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Read Also… అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. నీటి పారుదల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?