అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. నీటి పారుదల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష
తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర నిధులకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందించే పనిలో పడింది.
CM KCR Irrigation review : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ర్టానికి అందే నిధులపై సీఎం గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న నిధులపై స్పష్టత వచ్చింది. ఇందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ బడ్జెట్‌పై సీఎం చర్చిస్తున్నారు.
Read Also... ఏపీ ఎస్‌ఈసీ ఈవాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ.. ఫిబ్రవరి 9 వరకు యాప్‌ను వినియోగించవద్దని హైకోర్టు ఆదేశం