స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏకమవుతున్న పార్టీలు.. ఒకరు రాజీనామాకు సిద్ధమంటే.. ప్రాణత్యాగానికైనా సై అంటున్న మరొకరు

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పోరాటం తీవ్రమైంది. స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పు నిప్పుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు..

స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏకమవుతున్న పార్టీలు.. ఒకరు రాజీనామాకు సిద్ధమంటే.. ప్రాణత్యాగానికైనా సై అంటున్న మరొకరు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 05, 2021 | 5:49 PM

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పోరాటం తీవ్రమైంది. స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పు నిప్పుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కటవుతున్నారు. కార్మికుల పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని వైసీపీ ఎంపీలు ప్రకటిస్తే.. ప్రాణత్యాగానికి సిద్దమంటున్నారు టీడీపీ నేతలు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని ఆనాడు ఉద్యమించి సాధించుకుంటే.. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని మండిపడుతున్నాయి కార్మిక సంఘాలు. అన్ని పార్టీలు వారి పోరాటానికి మద్దతు ఇచ్చాయి. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు వైసీపీ ఎంపీలు. మరోవైపు ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్నారు TDP విశాఖ ఎమ్మెల్యే రామకృష్ణబాబు.

మరోవైపు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రాష్ట్రానికి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. కార్మిక సంఘాలు, వివిధ వర్గాల ఆందోళన నేపథ్యంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చారు వైసీపీ ఎంపీలు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు ఇద్దరూ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు రామ్మోహన్‌ నాయుడు. లేదంటే ఢిల్లీ రైతు ఉద్యమం తరహాలోనే పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?