AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో గత్తర లేపుతా.. జాతీయ పార్టీ స్థాపించి తీరతా : కేసీఆర్

నేనే ఆ పొలికేక పెడతా మిర్యాలగూడః నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గత్తర లేపుతా, జాతీయ పార్టీ స్థాపించి తీరుతా అని ఆవేశంగా ప్రకటించారు. దేశం కోసం ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులు ఉంటే మీ బిడ్డగా నేనే ఆ పొలికేక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అది జరగాలంటే 16కి 16 ఎంపీ స్థానాలు […]

దేశంలో గత్తర లేపుతా.. జాతీయ పార్టీ స్థాపించి తీరతా : కేసీఆర్
Vijay K
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 4:51 PM

Share
  • నేనే ఆ పొలికేక పెడతా

మిర్యాలగూడః నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గత్తర లేపుతా, జాతీయ పార్టీ స్థాపించి తీరుతా అని ఆవేశంగా ప్రకటించారు. దేశం కోసం ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులు ఉంటే మీ బిడ్డగా నేనే ఆ పొలికేక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అది జరగాలంటే 16కి 16 ఎంపీ స్థానాలు మనం గెలవాలని కేసీఆర్ అన్నారు.

ఈ దేశం మారాలి. 2000 ఏడాదిలో నేను బయలుదేరిననాడు తెలంగాణ ఎక్కడ తెస్తవ్? నీవల్ల ఏమైతదని నవ్విండ్రు. నేను మీకు ప్రమాణం చేసి చెప్తావున్నా.. ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు తేవడానికి భగవంతుడు నాకిచ్చిన సర్వ శక్తులూ ఒడ్డుతా.. దేశంలో గత్తర లేపుతా.. అవసరమైతే జాతీయ పార్టీ కూడా స్థాపిస్తా అంటూ కేసీఆర్ ఆవేశంగా ప్రసంగించారు.

ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాలన్నీ సమీక్ష చేసి, ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కలుపుకుని జాతీయ పార్టీ స్థాపిస్తా. హైదరాబాద్ సిటీలో సగం మాత్రమే ఉండే సింగపూర్ దేశానికి 193 కిలోమీటర్ల సముద్ర తీరమే ఉంది. కానీ వాళ్లు డీల్ చేసే కంటైనర్లు మూడు కోట్ల 70 లక్షలు. భారత దేశంలో 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నప్పటికీ మనం డీల్ చేసే కంటైనర్లు 75 నుంచి 80 లక్షలు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందనుకుంటూ పెదవులు చప్పరించుడే మన పని కాకూడదు. మీ ఆశీస్సులతో దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం పొలి కేక పెట్టేందుకు సిద్ధమని కేసీఆర్ చెప్పారు.

చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఆ ఇంటర్వ్యూ తర్వాత నా పరిస్థితి..
ఆ ఇంటర్వ్యూ తర్వాత నా పరిస్థితి..